కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానం వేదికగా భారత్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 24 ఓవర్లలో కేవలం వంద పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. డుమినీ 51, మర్క్‌రం 32 మినహాయించి మిగతా ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం అయ్యారు. చహల్ 2, బుమ్రా1, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీసుకున్నారు. 


అంతకన్నా ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన ఆరు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. రోహిత్ డకౌట్ అవడంతో పిచ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లంతా అంతంత మాత్రం ప్రతిభనే కనబర్చినా.. శిఖర్ ధావన్ (63 బంతుల్లో 76 పరుగులు)తో కలిసి విరాట్ కోహ్లీ (159 బంతుల్లో 2 సిక్సులు, 12 ఫోర్లతో 160 పరుగులు) ఆడిన తీరు ఆకట్టుకుంది. ఫలితంగా టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేయగలిగింది.