Special Story on Rajasthan Royals: 2008 ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌... ఆ సీజన్‌ లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆడిన 14 మ్యాచుల్లో 11 గెలిచింది. మూడు మ్యాచుల్లో ఓటమిపాలైంది. 22 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌ గా నిలిచింది. సెమీ ఫైనల్‌ లో ఢిల్లీ డెర్‌ డెవిల్స్‌ తో తలపడి 105 పరుగుల తేడాతో గెలిచి.. ఫైనల్‌ కు దూసుకెళ్లింది. ఇక ఫైనల్‌ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ను కూడా మట్టికరిపించింది. మూడు వికెట్ల తేడాతో గెలిచి షేన్‌ వార్న్‌ నాయకత్వంలోని అప్పటి రాజస్థాన్‌ రాయల్స్‌.. తొలి టోఫ్రీని కైవసం చేసుకుంది. అక్కడితోనే ఆ జట్టు జైత్రయాత్ర ఆగిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 సీజన్లు గడిచిపోయాయి కానీ.. మరోసారి ఆ జట్టు విజేతగా నిలవలేకపోయింది. స్టార్‌ ఆటగాళ్లతో నిండినప్పటికీ నిలకడలేమి సమస్యతో ప్రతిసారి ఊరించి ఊసూరుమనిపించింది. మరి ఈసారి కొత్త రూపు సంతరించుకున్న రాజస్థాన్‌.. సమష్టిగా సత్తాచాటి రెండో సారి టైటిల్‌ను దక్కించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. 


ఐపీఎల్‌ లో రెండో టైటిల్‌ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌ ఎదురుచూపులు కొనసాగుతునే ఉన్నాయి. ఎలాగైనా ట్రోఫీ కొట్టాలనే ప్రతిసారి ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం అందడం లేదు. 2022 సీజన్‌ లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు దాదాపుగా పూర్తిగా మారిపోయింది. వేలానికి ముందు కెప్టెన్‌ సంజుశాంసన్‌, బట్లర్‌ తో పాటు యశస్వి జైశ్వాల్‌ ను రిటైయిన్‌ చేసుకుంది. మెగా వేలంలో మరో 21 మంది ఆటగాళ్లు కొనుగులు చేసింది. 


టీమిండియా పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ కోసం వేలంలో అత్యధికంగా 10 కోట్లు ఖర్చు పెట్టింది. విండీస్‌ బ్యాటర్‌ హెట్‌మయర్‌ కోసం 8.5 కోట్లు, న్యూజిలాండ్‌ పేసర్‌ బౌల్ట్‌ కోసం 8 కోట్లు, దేవ్‌దత్‌ పడిక్కల్‌ కోసం 7.75 కోట్లు, చాహల్‌ కోసం 6.5 కోట్లు, అశ్విన్‌ కోసం 5 కోట్లు ఖర్చుచేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌కు బ్యాటింగే ప్రధాన బలం. కెప్టెన్‌ శాంసన్‌తో పాటు బట్లర్‌, పడిక్కల్‌, జైశ్వాల్‌, హెట్‌మయర్‌, వాండర్‌ డసెన్‌, పరాగ్‌లతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా ఉంది. 


ఇక ఎంతో అనుభవం ఉన్న అశ్విన్‌, చాహల్‌తో కూడిన స్పిన్‌ విభాగం ఆ జట్టుకు మరో బలం. మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగలిగే ఆల్‌రౌండర్లు లేకపోవడం రాజస్థాన్‌కు ప్రతికూలాంశం. కివీస్‌ ఆల్‌రౌండర్‌ నీషమ్‌ను తీసుకున్నప్పటికీ అతని పర్ఫామెన్స్‌ పై అనుమానాలున్నాయి. పేస్‌ బౌలింగ్‌లో అనుభవ లేమి రాజస్థాన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. విదేశీ పేసర్లలో బౌల్ట్‌ మినహా మరెవ్వరిపై నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఇక ప్రసిద్ధ్‌ కృష్ణ ఒత్తిడిని ఎలా తట్టుకుంటాడన్నది కీలకం. మొత్తంగా రాజస్థాన్‌ రాయల్స్‌ సమష్టిగా సత్తాచాటితే ప్లేఆఫ్స్‌ చేరుకునే అవకాశం లేకపోలేదు. మరి ఏ జట్టు ఫైనల్‌ కు వెళ్తుందో.. ఏది లీగ్‌ దశలోనే నిష్క్రమిస్తుందో వేచిచూడాలి.


Also Read: India corona Update: స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు- మహమ్మారి కారణంగా 150 మంది మృతి!


Also Read: Traditional Holi Colours: హోలీలో సంప్రదాయ రంగులు.. వీటి వల్ల చర్మానికి ఎంతో ప్రయోజనం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook