Sunrisers Hyderabad Vs Chennai Super Kings Match Highlights: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీఎస్‌కేకు ఇది వరుసగా రెండో ఓటమి కాగా.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఈ సీజన్‌లో రెండో విజయం. ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ 18.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఫినిష్ చేసింది. మార్‌క్రమ్‌ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అభిషేక్‌ శర్మ కేవలం 12 బంతుల్లోనే 37 పరుగులతో దూకుడు ప్రదర్శించాడు. హైదరాబాద్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయలతో నాలుగో స్థానంలో ఉండగా.. చెన్నై కూడా రెండు విజయాలతో మూడో స్థానంలో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నై విధించిన 167 పరుగుల లక్ష్యాన్ని బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 2.4 ఓవర్లలోనే 46 పరుగులు జోడించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ చెలరేగి ఆడాడు. 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 37 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 31, 3 ఫోర్లు, ఒక సిక్స్‌) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. వన్‌డౌన్‌లో వచ్చిన మార్‌క్రమ్ (36 బంతుల్లో 50, 4 ఫోర్లు, ఒక సిక్స్‌) దుమ్ములేపాడు. క్లాసెన్ (10 నాటౌట్), నితీష్ రెడ్డి (14 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. సిక్సర్‌తో నితీష్ రెడ్డి మ్యాచ్‌ను ముగించాడు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, తీక్షణ చెరో వికెట్ పడగొట్టారు.


అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు ఆరంభంలోనే దెబ్బ తీశారు. రచిన్ రవీంద్ర (12)ను భువనేశ్వర్ ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26)ను షాబాజ్ అహ్మద్ పెవిలియన్‌కు పంపించాడు. అజింక్యా రహానే (35) రాణించగా.. శివమ్ ధుబే (24 బంతుల్లో 45, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. డారిల్ మిచెల్ (13) విఫలమయ్యాడు. రవీంద్ర జడేజా 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో భువనేశ్వర్, టి.నటరాజన్, కమిన్స్, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్ తలో వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అభిషేక్ శర్మకు దక్కింది. 


Also Read: Anaparthi Seat: అనపర్తి అసమ్మతిపై చంద్రబాబు దిగొచ్చినట్టేనా, సీటు మార్చే ఆలోచన


Also Read: Save The Tigers 2: బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఇండియా టాప్ 3 లిస్టులో ‘సేవ్ ది టైగర్స్’



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook