Ruturaj Gaikwad star as Chennai Super Kings crush Sunrisers Hyderabad: ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌ గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేయడంతో.. చెన్నై 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నికోలస్ పూరన్ (64 నాటౌట్), అభిషేక్ శర్మ (39), కేన్ విలియమ్సన్ (47) పోరాడినా ఫలితం లేకపోయింది. చెన్నై పేసర్ ముఖేష్ చౌదరి నాలుగు వికెట్లు పడగొట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ దూకుడుగా పరుగులు చేశారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని ముఖేశ్ చౌదరి విడదీసాడు. ఓ మంచి బంతితో  అభిషేక్ శర్మ‌ను ఔట్ చేశాడు. ఆ మరుసటి బంతికే రాహుల్ త్రిపాఠి (0)ని కూడా పెవిలియన్ చేర్చాడు. దాంతో సన్‌రైజర్స్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.


ఎయిడెన్ మార్క్‌రమ్(17) రెండు భారీ సిక్సర్లతో మంచి ఊపుమీద కనిపించాడు. అదే భారీ షాట్‌కు ప్రయత్నించిక్యాచ్ ఔట్ అయ్యాడు. కేన్ మామతో జత కలిసిన నికోలస్ పూరన్ సిక్సర్లతో అలరించాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. రన్ రేట్ పెరిగిపోతుండడంతో కేన్ వేగంగా ఆడే క్రమ్మలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాపీయతికి శశాంక్ సింగ్ (15) ఔటవ్వగా.. ఆ వెంటనే వాషింగ్టన్ సుంధర్ (2) కూడా పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ చివరలో పూరన్ బౌండరీలు బాదినా.. అవి సరిపోలేదు. చెన్నై పగ్గాలు మళ్లీ అందుకున్న ఎంఎస్ ధోనీ.. అభిమానులకు మంచి విజయాన్ని అందించాడు. 



 ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (99) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే (85 నాటౌట్) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. ధోనీ (8), జడేజా (1) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్ టీ నటరాజన్ రెండు వికెట్లు తీసాడు.


Also Read: Praja Sangrama Yatra: టీఆర్ఎస్ నేతలారా.. మీ ప్రభుత్వం ఉండేది కొద్దిరోజులే: బండి సంజయ్‌


Also Read: Kili Paul Attack: ఇంటర్నెట్ సంచలనం కిలి పాల్‌పై దుండగుల దాడి.. కత్తితో పొడిచి, కర్రలతో కొట్టి..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook