Praja Sangrama Yatra: టీఆర్ఎస్ నేతలారా.. మీ ప్రభుత్వం ఉండేది కొద్దిరోజులే: బండి సంజయ్‌

Bandi Sanjay slams Telangana CM KCR. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది కొద్దిరోజులే అని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2022, 10:26 PM IST
  • టీఆర్ఎస్ అరాచకాలను అడ్డుకుంటాం
  • టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది కొద్దిరోజులే
  • కోయిల్ సాగర్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం
Praja Sangrama Yatra: టీఆర్ఎస్ నేతలారా.. మీ ప్రభుత్వం ఉండేది కొద్దిరోజులే: బండి సంజయ్‌

MP Bandi Sanjay fires on Telangana CM KCR at Praja Sangrama Yatra: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది కొద్దిరోజులే అని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే కోయిల్ సాగర్ ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. అగ్రవర్ణాలకు ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అని సంజయ్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి భారం మోపిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీ కార్మికుల సమస్యలెందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నారాయణ పేట జిల్లా ధన్వాడలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్‌ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

'ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రజలను, బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. అక్రమంగా కేసులు పెట్టి భయపెడుతున్నారు. టీఆర్ఎస్ నేతలారా.. మీ ప్రభుత్వం ఉండేది కొద్ది రోజులే. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. మీరు చేస్తున్న అరాచకాలకు తగిన సమాధానం చెబుతాం' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. 'కేసీఆర్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదు. టీఆర్ఎస్ నేతలు గ్రామాల్లోకి వస్తే వారిని నిలదీయండి. బీజేపీ అధికారంలోకి వస్తే కోయిల్ సాగర్ ద్వారా సాగునీరందించడంతో పాటు ధన్వాడ చెరువును నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం' అని ధన్వాడలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

'టీఆర్ఎస్ వాళ్లకు మైండ్ దొబ్బి ప్రజా సంగ్రామ యాత్రకు జనం తరలిరావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. ధన్వాడకు వచ్చిన ప్రజలను చూసైనా వాస్తవాలు మాట్లాడితే మంచిది. ప్రజా సంగ్రామ యాత్రతో టీఆర్ఎస్ నేతలకు దడ, వణుకు మొదలైంది. ఇక సీఎం కేసీఆర్‌కు అయితే నిద్ర పట్టడం లేదు. ఇక సీఎం ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు, కొత్త వాళ్లకు పెన్షన్లు రావడం లేదు. అయితే కేసీఆర్ కుటుంబంలో మాత్రం 5 గురికి పదవులిచ్చుకుని రూ.25 లక్షలు సంపాదిస్తున్నారు' అని ఎంపీ విమర్శించారు. 

'కేంద్రం పేదలకు ప్రతినెలా బియ్యం ఉచితంగా సరఫరా చేస్తోంది. కానీ కేసీఆర్ దాన్ని బంద్ చేయాలని చూస్తున్నారు. రేషన్ బియ్యం వెనుక రాష్ట్ర ప్రభుత్వం పెద్ద స్కాం చేస్తోంది. ఈ విషయంలో కేసీఆర్ బండారాన్ని బయటపెడతాం. కేంద్రం 1.4 లక్షల ఇండ్లు మంజూరు చేసినా.. సీఎం మాత్రం ఆ ఇండ్లు నిర్మిస్తే బీజేపీకి ఎక్కడ పేరొస్తుందనే అక్కసుతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. కేంద్ర పథకాలు అమలు చేస్తున్న నరేంద్ర మోదీ ఫొటో పెడితే జడ్పీటీసీపై కేసులు పెట్టి వేధించడం సిగ్గు చేటు. ఆర్టీసీ, బీడీ కార్మికులను ఆదుకోకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది. పేదల భూములను కూడా కబ్జా చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్' అని ఎంపీ బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. 

Also Read: Shraddha Das Hot Pics: చీర కట్టులోనూ.. నడుమందాలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్!

Also Read: Cine Karmikotsavam 2022 : చిరంజీవిపై మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News