SRH VS DC: సన్ రైజర్స్ టీమ్ ఢిల్లీ కేపిటల్స్ కు ఛాలెంజ్ ఇస్తుందా? Match Preview
ఢిల్లీ క్యాపిటల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ నేడు తలపడనున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ నేడు తలపడనున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL 2020 ) లో 11వ మ్యాచులో ఈ రెండు టీమ్స్ విజయం కోసం తహతహలాడుతున్నాయి. హైదరాబాద్ ను ఓడించి తన గెలుపుల పరంపరను కొనసాగించాలని ఢిల్లీ ప్రయత్నించనుంది. హైదరాబాద్ మాత్రం తన తొలి విజయాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. డేవిడ్ వార్నర్ సారథ్యం వహిస్తున్న సన్ రైజర్స్ టీమ్ ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది.
ALSO READ| IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే
ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) టీమ్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. శ్రెయాస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ ను సూపర్ ఓవర్ వరకు తీసుకొని వెళ్లి మరి ఓడించింది. తరువాత చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు కూడా చుక్కలు చూపించింది.
మరో వైపు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తొలి విజయం కోసం ప్రయత్నించనుంది. టోర్నమెంట్ లో జీరో వద్ద కొనసాగుతున్న ఈ టీమ్ ఖాతా తెరవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. సీజన్ ఆరంభంలో జానీ బెయిర్ స్టోక్, మనీష్ పాండే అద్భుతమైన ఆటతీరు చూపించారు. అయినా కానీ 164 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. రెండో మ్యాచులో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కు మంచి టార్గెట్ ఇవ్వడంలో విఫలం అయింది.
ఢిల్లీ బౌలింగ్
టీమ్ ప్లేయర్స్ గురించి మాట్లాడితే ఢిల్లీ టీమ్ లో సౌత్ ఆఫ్రికా టీమ్ కు చెందిన కైగిసో రబాడా, ఎన్రిక్ నార్జోలు బౌలింగ్ లో అద్భుతాలు చేయగలరు. అదే సమయంలో అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా కూడా కీలకం.
బ్యాటింగ్ విషయానికి వస్తే
టీమ్ లో సీనియర్ ప్లేయర్ అయిన శిఖర్ ధావన్, యువకెరటం పృథ్వీషా కలిసి మంచి స్టార్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. రిషభ్ పంత్, అయ్యర్ కలిసి చెన్నై తో జరిగిన మ్యాచులో మంచి ఆటతీరును ప్రదర్శించారు. దీంతో వీరిపై కూడా టీమ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. దీంతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ కూడా బ్యాట్ తో మ్యాజిక్ చేయగలడు.
ALSO READ| Rice ATM : హైదరాబాద్ లో 12 వేల మంది కడుపు నింపిన రైస్ ఏటీఎం
సన్ రైజర్స్
సన్ రైజర్స్ ( SRH ) మిడిల్ ఆర్డర్ కాస్త వీక్ గా ఉంది. టీమ్ తన తొలి విజయాన్ని కైవసం చేసుకోవాలి అంటే వార్నర్ ( David Warner ), బెయిర్ స్టోతో పాటు మరో బ్యాట్స్ మెన్ కూడా ఆడాల్సి ఉంటుంది.
2016లో ఐపీఎల్ టైటిగ్ నెగ్గిన సన్ రైజర్స్ టీమ్ లో మొహమ్మద్ నబీ అటు బాల్ తో .. ఇటు బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు. అయితే ఈ స్థానంలో ఇప్పుడు విలియమ్సన్ ను భర్తీ చేసే అవకాశం ఉంది.
రాషిద్ ఖాన్..
సన్ రైజర్స్ బౌలర్స్ లో రాషిద్ ఖాన్ పై ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ మరో బౌలర్ నుంచి మంచి సపోర్ట్ లేకపోవడంతో టీమ్ ఇబ్బంది పడుతోంది. ఢిల్లీపై హైదరాబాద్ విజయం సాధించాలి అనుకుంటే మాత్రం బౌలింగ్ లో సత్తా చాటాల్సి ఉంటుంది.
సన్ రైజర్స్ టీమ్ ఇదే..
సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ ( కెప్టెన్ ) జానీ బెయిర్ స్టో ( వికెట్ కీపర్ ) కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, శ్రీవాస్త్ గోస్వామి, విరాట్ సింగ్, ప్రియం గార్గ్, రిధిమాన్ సాహా( వికెట్ కీపర్ ) , అబ్దుల్ సమద్, విజయ్ శంకర్, మొహమ్మద్ నబీ, రాషిద్ ఖాన్, అభిషేక్ శర్మ, బి సందీప్, సంజయ్ యాదవ్, ఫేబియన్ ఏలెన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, షాహ్ బాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్, బిలీ స్టాన్ లేక్, బాసిల్ థంపీ |
ALSO READ| Gold Monetisation Scheme: లాకర్ లో ఉన్న మీ బంగారంతో డబ్బు సంపాదించండి
ఢిల్లీ టీమ్ ఇదే
ఢిల్లీ క్యాపిటల్స్: శ్రెయాస్ అయ్యర్ ( కెప్టెన్ ), రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, పృథ్వీషా, శిమ్రోన్ హెట్ మాయర్, కగిసో రబాడ, అజింక్య రహానే, అమిత్ మిశ్రా, రిషభ్ పంత్ ( వికెట్ కీపింగ్ ) , ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్, సందీప్ లామిచానో, కీమో పాల్, డెనియల్ సెగ్స్, ఎన్రిచ్ నోర్జే , ఆలెక్స్ క్యారీ ( వికెట్ కీపర్ ), అవేష్ ఖాన్, తుషార్ దేశ్ పాండే, హర్షల్ పటేల్, మార్కస్ స్టోయినీస్, లలిత్ యాదవ్ |
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR