Rahul Tripathi takes superb One-Handed Catch to Dismiss Shubman Gill: క్రికెట్‌ ఆటలో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన, అద్భుతమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి ఎవరూ ఊహించని రీతిలో బ్యాటర్ ఔట్ అవుతాడు. ఎక్కువగా ఫీల్డర్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పట్టి.. ఎవరూ ఊహించని విధముగా బ్యాటర్‌ను పెవిలియన్ చేర్చుతారు. ఇలాంటివి ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం చూసే ఉంటాం. తాజాగా ఐపీఎల్ 2022లో అంతకుమించి క్యాచ్ నమోదైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రాహుల్ త్రిపాఠి చేపపిల్లలా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ పట్టాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ముందుగా గుజరాత్ బ్యాటింగ్ చేయగా.. భువనేశ్వర్ కుమార్ మూడో ఓవర్ చేశాడు. ఆ ఓవర్లోని రెండో బంతిని శుభమాన్ గిల్ ఆఫ్ సైడ్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. బంతి వేగం చుసిన అందరూ బౌండరీ పక్కా అనుకున్నారు. అయితే మిడిలార్డర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠి.. చేపపిల్లలా గాల్లోకి జంప్ చేసి ఎడమ చేతితో సూపర్బ్ క్యాచ్ పట్టాడు.


రాహుల్ త్రిపాఠి పట్టిన క్యాచుకు శుభమాన్ గిల్ ఫ్యూజులు ఔట్ అయ్యాయి. ఒక్కసారిగా షాక్ తిన్న గిల్.. ఆపై తేరుకుని పెవిలియన్ చేరాడు. మరోవైపు బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా 'ఏం పట్టావ్' అనేలా ఓ రియాక్షన్ ఇచ్చాడు. కామెంటర్లు అయితే త్రిపాఠి పట్టిన క్యాచుకు ఆశ్చర్యపోయారు. సూపర్ క్యాచ్ అంటూ పొగిడారు. ఇక మైదానంలోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫాన్స్ అయితే సంబరాలు చేసుకున్నారు. సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు అతడి వద్దకు వచ్చి అభినందించారు. 



రాహుల్ త్రిపాఠి పట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ఫాన్స్.. 'స్టన్నింగ్‌ క్యాచ్'‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'వాట్ ఏ క్యాచ్', 'సూపర్ ఫీల్డింగ్', 'టేక్ ఏ బో', 'ఐపీఎల్ 2022లో బెస్ట్ క్యాచ్‌' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఈ క్యాచ్ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి. 


Also Read: Bhuvneshwar Kumar: భువనేశ్వర్‌ కుమార్‌ ఖాతాలో చెత్త రికార్డు.. లీగ్ చరిత్రలోనే..!


Also Read: Breast Cancer: క్యాన్సర్ డేంజర్ బెల్స్... తెలంగాణలో పెరుగుతున్న కేసులు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook