Bhuvneshwar Kumar: భువనేశ్వర్‌ కుమార్‌ ఖాతాలో చెత్త రికార్డు.. లీగ్ చరిత్రలోనే..!

Bhuvneshwar Kumar gives 12 extra runs in Single over. ఐపీఎల్ లీగ్ చరిత్రలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తరఫున ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా భువనేశ్వర్‌ కుమార్‌ నిలిచాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2022, 02:00 PM IST
  • భువనేశ్వర్‌ కుమార్‌ ఖాతాలో చెత్త రికార్డు
  • లీగ్ చరిత్రలోనే భువనేశ్వర్‌ చెత్త రికార్డు
  • ఏకంగా 9 బంతులు సంధించి
Bhuvneshwar Kumar: భువనేశ్వర్‌ కుమార్‌ ఖాతాలో చెత్త రికార్డు.. లీగ్ చరిత్రలోనే..!

Bhuvneshwar Kumar equals Dale Steyn unwanted IPL record for Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) స్టార్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ తన ఖాతాలో ఓ చెత్త బౌలింగ్‌ రికార్డును వేసుకున్నాడు. ఐపీఎల్ లీగ్ చరిత్రలో ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా భువీ నిలిచాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌ ఈ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్‌ స్టెయిన్‌ తొలి ఓవర్‌లో 17 పరుగులు ఇచ్చాడు. 

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్ తొలి ఓవర్‌ వేసి ఏకంగా 17 రన్స్ ఇచ్చుకున్నాడు. వైడ్‌ల రూపంలో 11 పరుగులు (5+5+1) ఇవ్వగా.. లెగ్‌ బై రూపంలో మరో పరుగు ఇచ్చాడు. అంటే మొత్తంగా ఎక్స్‌ట్రాల రూపంలో భువీ 12 పరుగులు సమర్పించుకున్నాడు. గుజరాత్‌ ఓపెనర్లు మాథ్యూ వేడ్, శుభ్‌మాన్ గిల్ కేవలం ఐదు పరుగులే చేశారు. మరో వైడ్ బంతి బౌండరీ వెళ్లకుండా వికెట్ కీపర్ నికోలస్ పూరన్ ఆపాడు కాబట్టి సరిపోయింది. 

తొలి ఓవర్‌లో భువనేశ్వర్‌ కుమార్ ఏకంగా 9 బంతులు సంధించి.. ప్రస్తుత సీజన్‌లో సుదీర్ఘమైన ఓవర్‌ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఇప్పటివరకు డేల్‌ స్టెయిన్‌ పేరిట ఉన్న చెత్త ఐపీఎల్‌ రికార్డును భువీ సమం చేశాడు. ఆరేళ్ల పాటు అంతర్జాతీయ వన్డేల్లో ఒక్కసారి కూడా నో బాల్ వేయని భువీ.. ఐపీఎల్‌ 2022లో ఎక్స్‌ట్రాల రూపంలో ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం విశేషం. టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చిన భువీ.. రెండు వికెట్లు పడగొట్టాడు.  

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వైడ్స్ వేసిన రెండో జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. ఈ మ్యాచులో ఏకంగా 22 అదనపు పరుగులు సమర్పించుకుంది. ఇందులో 20 వైడ్‌లు ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్ 12 వైడ్స్ వేయగా.. ఉమ్రాన్ మాలిక్ 5, మార్కో జాన్సెన్ 2, టీ నటరాజన్ ఓ వైడ్ వేసాడు. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 21 వైడ్‌లు సమర్పించుకుని అగ్ర స్థానంలో ఉంది. 

Also Read: Sunrisers Hyderabad: జోరుమీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌ ఔట్!

Also Read: Stampede in Tirumala: తిరుమలలో ఉద్రిక్త పరిస్థితులు.. తొక్కిసలాటలో భక్తులకు గాయాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News