ఎంత గొప్ప స్థాయికి ఎదిగిన ప్రతి ఆటగాడి జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. రెండు ప్రపంచ కప్‌ల హీరోగా చెప్పుకునే భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం కష్టాలు అనుభవించాడు. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత తన ఇంటిపై రాళ్ల దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఓ హంతకుడిలా చూశారని చేదు జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘వాస్తవానికి క్యాన్సర్ నుంచి కోలుకున్నాక నాకు దొరికిన అద్భుత అవకాశం 2014 టీ20 వరల్డ్ కప్. కానీ మునుపటిలా సిక్సర్ల వర్షం కురిపించలేకపోయా. ఫామ్ కోసం తంటాలు పడ్డాను. ముఖ్యంగా ఫైనల్లో 21  బంతులాడి కేవలం 11 పరుగులు చేసి ఔటయ్యాను. ఆ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ సంబరాలు చేసుకుంది. కానీ మ్యాచ్  నావల్లే ఓడిందని, నన్ను ఆటగాడిలా కాక హంతకుడిలా ట్రీట్ చేశారని’ స్పోర్ట్ స్క్రీన్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపాడు. Photos:  నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు


2007 టీ20 వరల్డ్ కప్‌లో ఓ ఓవర్లో 6 సిక్సర్లు బాదిన నేను ఈ వరల్డ్ కప్‌లోనూ సిక్సర్లతో చెలరేగాలని అంతా ఊహించారు. కానీ మునుపటిలా ఆడలేకపోయాను. ఫైనల్ తర్వాత మీడియా సైతం నన్ను వెంటాడింది. నన్ను ఓ విలన్‌గా చిత్రీకరించింది. ఇంటికి వెళ్లి చూస్తే హంతకుడిలా, విలన్‌గా వ్యవహరించారు. మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారని’ 2014 టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించాడు.  రానా దగ్గుబాటి లవర్ ఫొటోలు చూశారా!


టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కావడం వల్ల విమర్శలు అధికమయ్యాయి. ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకెళ్లిన వ్యక్తిలాగా నాతో ప్రవర్తించారు. సచిన్ ట్వీట్ చేశాక ప్రజలు నా పరిస్థితి అర్థం చేసుకున్నారు. కానీ కెరీర్ ముగిసిపోయిందని అప్పుడే తెలుసుకున్నట్లు 38 ఏళ్ల మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తాజాగా తన మనసులో మాటను వెల్లడించాడు.. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!