Suryakumar Yadav Records: శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2-1తో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. నయా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తుఫాను ఇన్నింగ్స్ అభిమానులను అలరించింది. కేవలం 51 బంతుల్లోనే 9 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 112 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. దీంతో 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక జట్టు 16.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. ఇక ఈ సెంచరీతో సూర్య మూడు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మూడు సెంచరీలో సాధించిన నాన్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ మూడు టీ20 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మ్యాక్స్‌వెల్, మన్నో (3)లను సమం చేశాడు.


సూర్యకుమార్ యాదవ్ శ్రీలంకపై కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించిన రోహిత్ శర్మ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ నాలుగు సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా.. సూర్య రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ పేరిట రెండు సెంచరీలు సాధించాడు.


అతి తక్కువ బంతుల్లో 1500 పరుగులు 


సూర్యకుమార్ యాదవ్ శ్రీలంకపై భారీ ఇన్నింగ్స్‌తో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 1500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను కేవలం 843 బంతుల్లో 1500 పరుగులు చేశాడు. ఇది అత్యంత వేగంగా రికార్డు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ప్రస్తుతం ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్ తరఫున 45 మ్యాచ్‌ల్లో  1578 పరుగులు చేశాడు.


అంతర్జాతీయ టీ20లో అత్యధిక సెంచరీలు:


4 రోహిత్ శర్మ (భారత్)
3 సూర్యకుమార్ యాదవ్ (భారత్)
3 గ్లెన్ మాక్స్‌వెల్ (ఆసీస్)
3 కోలిన్ మున్రో (న్యూజిలాండ్)


టీ20ల్లో భారత్‌ తరఫున వేగవంతమైన సెంచరీ వీరులు


35 బంతుల్లో రోహిత్ శర్మ Vs శ్రీలంక (2017)
45 బంతుల్లో సూర్యకుమార్ యాదవ్ Vs శ్రీలంక (2023)
46 బంతుల్లో కేఎల్ రాహుల్ Vs వెస్టిండీస్ (2016)
48 బంతుల్లో సూర్యకుమార్ యాదవ్ Vs ఇంగ్లాండ్ (2022)


Also Read: Director Surender Reddy: షూటింగ్‌లో గాయపడిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. నొప్పిని సైతం లెక్కచేయకుండా..  


Also Read: India vs Sri Lanka: రాజ్‌కోట్‌లో సూర్య సునామీ.. బౌలర్ల మెరుపులు.. శ్రీలంక చిత్తు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook