Suryakumar Yadav: మరో రికార్డుకు చేరువలో సూర్యకుమార్ యాదవ్.. చరిత్రలో మూడో ఆటగాడిగా..
Suryakumar Yadav ICC T20 Rank: సూర్యకుమార్ యాదవ్ సూపర్ బ్యాటింగ్‌కు రికార్డులు దాసోహం అవుతున్నాయి. శ్రీలంకపై సెంచరీ సాధించిన సూర్య.. టీమిండియా తరుఫున టీ20ల్లో మూడు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తాజాగా మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు.
Suryakumar Yadav ICC T20 Rank: టీమిండియా నయా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఫామ్‌తో అదరగొడుతున్నారు. వరుస రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు. శ్రీలంకతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 112 పరుగులతో సెంచరీ సాధించి టీమిండియాకు సిరీస్ అందించాడు. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మరో ఘనతను అందుకోవడానికి కొంత దూరంలో నిలిచాడు.
సూర్య తన కెరీర్‌లో తొలిసారిగా 900 రేటింగ్ పాయింట్ల ఫిగర్‌ను తాకేందుకు దగ్గరగా ఉన్నాడు. ప్రస్తుతం 883 పాయింట్లతో టీ20 అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. కొత్త ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ రాగానే సూర్యకుమార్ తొలిసారిగా 900 రేటింగ్‌ను దాటనున్నాడు. సూర్య కంటే ముందు డేవిడ్ మలాన్, ఆరోన్ ఫించ్ మాత్రమే టీ20 క్రికెట్ చరిత్రలో 900 పాయింట్లు దాటారు.
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ఆటతీరుతో స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలోనూ అదే ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. రాజ్‌కోట్‌లో శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లో 112 పరుగులు చేశాడు. సూర్య కెరీర్‌లో ఇప్పటివరకు 45 టీ20 మ్యాచ్‌లు ఆడి 46.41 సగటు, 180.34 స్ట్రైక్ రేట్‌తో 1578 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
టీ20ల్లో అత్యంత వేగంగా 1500 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా సూర్య నిలిచాడు. 1500 పరుగుల మార్క్‌ను చేరుకోవడానికి కేవలం 843 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇది ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్‌కైనా అతి తక్కువ. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 150 లేదా అంతకంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 1500 పరుగుల మార్క్‌ను దాటిన మొట్టమొదటి ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు.
టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గానూ సూర్య నిలిచాడు. కెరీర్‌లో మూడో సెంచరీ పూర్తి చేసేందుకు కేవలం 45 బంతులు మాత్రమే తీసుకున్నాడు. 2017లో శ్రీలంకపై 35 బంతుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ.. భారత్ తరపున తక్కువ బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరుకున్న ఆటగాడిగా ఉన్నాడు.
Also Read: కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదన్న వర్మ.. డబ్బు కోసం ఏమైనా నాకుతావని!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook