ICC T20 rankings announcement: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ ప్రకటన వచ్చేసింది. టాప్ 10 ఆటగాళ్లలో టీమిండియా నుంచి కెప్టేన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌కి చోటు దక్కింది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 4వ స్థానంలో నిలవగా ఆ తర్వాత కేఎల్ రాహుల్ ( Virat Kohli and KL Rahul) ఆరో స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్ (Dawid Malan) నెంబర్ 1 స్థానం సొంతం చేసుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంకతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో రాణించిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ క్వింటన్ డి కాక్ (Quinton de Kock) 8వ స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్ ఒక స్థానం తగ్గి 9వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 


ఐసిసి ప్రకటించిన బౌలర్ల జాబితా విషయానికొస్తే.. టాప్ టెన్‌లో భారత బౌలర్లకు ఎవ్వరికీ చోటు దక్కలేదు. ఇండియన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) 12వ స్థానంతో సరిపెట్టుకోగా వాషింగ్టన్ సుందర్ 18వ స్థానంలో కొనసాగుతున్నాడు. యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) 25వ స్థానంలో కొనసాగుతున్నాడు.


Also read : IPL 2021: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్..ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు అనుమతి


అత్యుత్తమ జట్ల జాబితా విషయానికొస్తే.. ఇంగ్లండ్ జట్టు (England team) నెంబర్ 1 స్థానం సొంతం చేసుకోగా.. భారత జట్టు రెండో స్థానం కైవసం చేసుకుంది. మూడో స్థానంలో పాకిస్థాన్, నాలుగో స్థానంలో న్యూజిల్యాండ్ ఉండగా దక్షిణాఫ్రికా జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది.  


ఆల్‌రౌండర్ల జాబితాలో ఆఫ్ఘన్ సారధి మహమ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ రెండో స్థానంలో ఉన్నాడు. హార్ధిక్ పాండ్యకు టాప్ 20 ఆల్‌రౌండర్స్‌లో చోటు దక్కింది. భారత్ నుంచి ఆల్ రౌండర్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడు హార్థిక్ పాండ్య (Hardik Pandya) మాత్రమే.


Also read : T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఇండియా జట్టు ఎంపికపై గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook