Hardik Pandya: హార్ధిక్ పాండ్యా 'వాచ్' రేటు ఎంతో తెలిస్తే.. మైండ్ బ్లాంక్ అయిపోద్ది!

Hardik Pandya: సెలబ్రిటీలు ఏది కొన్నా..నెట్టింట వైరల్ గా మారుతుంటాయి. మెున్న జూ.ఎన్టీఆర్  కారు సోషల్ మీడియాలో హల్ చేస్తే..ఇవాళ టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా వాచ్ వైరల్ గా మారింది. అతడు కొన్న వాచ్ రేట్ ఎంతో తెలిస్తే...నోరెళ్లబెట్టక మానరు.!

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2021, 10:25 AM IST
  • నెట్టింట వైరల్ అవుతున్న హార్ధిక్ పాండ్యా వాచ్
  • విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఆల్ రౌండర్
  • ఐపీఎల్ 2021 సెప్టెంబరు 29న ప్రారంభం
Hardik Pandya: హార్ధిక్ పాండ్యా 'వాచ్' రేటు ఎంతో తెలిస్తే.. మైండ్ బ్లాంక్ అయిపోద్ది!

Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా(Hardik Pandya) విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా లగ్జరీ రోల్స్ రాయిస్(Rolls Royce)  కారులో తిరుగుతూ..సన్ గ్లాసెస్, టోఫీ పెట్టుకున్న  ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో(Social Media) పోస్ట్ చేశాడు. ఇప్పుడు అందులో ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో హార్ధిక్ పెట్టుకున్న వాచ్(Watch) మామూలుది కాదు. ఇప్పుడు దాని గురించే ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అంతలా చెప్పుకోవడానికి ఆ వాచీకి ఉన్న ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా?..పదండి ఓ లుక్కేద్దాం.

ఈ వాచీ డయల్ చుట్టూ 32 బగుట్టే కట్ పచ్చ (emerald - మరకతం) రాళ్లను సెట్ చేశారు. వాచ్ మొత్తం ప్లాటినం (platinum)తో తయారైంది. దీని ధర రూ.5 కోట్లు అంటే నమ్మగలరా. ఇది నిజం. వాచీ డయల్ చుట్టూ... పచ్చ మరకత రాళ్లను ఎటాచ్ చేశారు. ఇది 5711 రేంజ్ అరుదైన వాచీ. ముఖ్యంగా దీని డయల్‌లో డార్క్ గ్రే ఉంది కదా... అందువల్ల ఇది అత్యంత అరుదైనది అన్నమాట.
హార్ధిక్ పాండ్యా(Hardik Pandya)కు వాచీలంటే చాలా ఇష్టం. వరైటీగా ఉన్నవాటిని సేకరిస్తూ ఉంటాడు. ఇది కూడా అలా వచ్చినదే. ఇలాంటివి అతని దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఈ పటేక్ ఫిలిప్పే నాటిలస్ ప్లాటినం 5711(Patek Philippe Nautilus Platinum 5711) వాచీలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచీలు. అందువల్లే చాలా తక్కువ మంది దగ్గర ఇవి ఉంటాయి. 

Also Read: Virat Kohli : విరాట్ తాగే వాటర్ లీటర్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021(IPL 2021) సెకండ్ ఎడిషన్  సెప్టెంబర్ 19 న ప్రారంభమవుతుంది. ఆగస్టు13నే అబుదాబి(Abu Dhabi) చేరుకున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) టీమ్..ప్రాక్టీసు మెుదలుపెట్టింది. ఇందులో భాగంగానే..ఖాళీ సమయాల్లో బయట తిరుగుతూ హార్ధిక్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐపీఎల్ పూర్తయిన వెంటనే ఐసీసీ టీ20వరల్డ్ కప్ 2021(ICC T20 World Cup 2021) జరగునుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News