T20 World Cup Final: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌తో తలపడే జట్టు అదే.. రికీ పాంటింగ్ జోస్యం!
Ricky Ponting Predicts India and Australia fight In T20 World Cup Final. టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరే జట్లు ఏవో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంచనా వేశాడు.
Ricky Ponting Says India and Australia to play T20 World Cup 2022 Final: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. సూపర్ 12 చివరి దశకు చేరుకున్నా.. సెమీస్ బెర్తులు ఇంకా ఖరారు కాలేదు. గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్ సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక జట్లు రేసులో ఉన్నాయి. గ్రూప్ 2లో ఉన్న భారత్ చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై విజయం సాధిస్తే.. అగ్రస్థానంతో సెమీస్ చేరుకొంటుంది. మిగతా స్థానం కోసం దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.
టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్ బెర్తు హోరాహోరీగా ఉన్నా.. మెగా టోర్నీలో ఫైనల్‌కు చేరే జట్లు ఏవో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంచనా వేశాడు. నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా జరిగే ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియాలు తలపడుతాయని జోస్యం చెప్పాడు. తాజాగా ఐసీసీకి రాసిన కాలమ్‌లో పాంటింగ్ ఇలా పేర్కొన్నాడు. 'నిజం చెప్పాలంటే.. టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు ఆడబోతున్నారో ఎవరికి తెలుసు?. మనం అంచనా మాత్రమే వేయగలం. గ్రూప్ దశను అధిగమించి ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుతుందని నేను నమ్ముతున్నా' అని రికీ తెలిపాడు.
'దక్షిణాప్రికా డేంజరస్ జట్టు. ఆ జట్టుకు ఫైనల్ చేరే అవకాశాలు తక్కువ. నేను గతంలో చెప్పినట్లే.. మెగా టోర్నీ ఫైనల్ ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్యే ఉంటుంది. అస్ట్రేలియా కొన్ని విభాగాల్లో వెనకబడి ఉంది. అలానే భారత్ కూడా జస్ప్రీత్ బుమ్రా సేవలను కోల్పోయింది. అన్నింటిని అధిగమించి.. రెండో భాగంలో అత్యుత్తమ క్రికెట్‌ను ఆడాల్సి ఉంటుంది. మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. ఎవరు కప్ అందుకుంటారో చూడాలి. నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నా' అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.
Also Read: సబ్బు పెట్టిమరీ.. బట్టలు ఉతుకుతున్న కోతి! రన్నింగ్ కామెంటరీ వింటే నవ్వాగదు
Also Read: మినిమం కామన్ సెన్స్ లేదా.. అక్కినేని అమలను ఆటాడుకుంటున్న నెటిజన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook