Malik Rizwan News: టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2021) లో ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్‌కు ముందు పాకిస్తాన్‌ ఫ్యాన్ కు గుడ్ న్యూస్! జ్వరం లక్షణాలతో బాధపడుతున్న పాక్ స్టార్‌ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan News), షోయబ్ మాలిక్ (Shoaib Malik News) ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తొలుత ప్రచారం జరిగింది. ఈ ఇద్దరు గత రెండు రోజులు నుంచి ఫ్లూ జ్వరంతో బాధపడతున్న క్రమంలో ఐసీసీ వీరిద్దరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లు బుధవారం ప్రాక్టీస్ సెషన్‌కు దూరమయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌లో రిజ్వాన్‌, షోయబ్‌ మాలిక్‌ అందుబాటులో ఉంటారో లేరోనన్న అంశంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ మెడికల్ టీమ్ స్పష్టత ఇచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ఆడేందుకు వారిద్దరూ ఫిట్ గా ఉన్నారని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌ విజయంలో రిజ్వాన్, మాలిక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా  మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. నవంబర్ 11న (గురువారం) పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌ వేదికగా జరగనుంది. ఇక ఇప్పటికే ఇంగ్లండ్‌పై విజయంతో న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.


ఈ సెమీస్ (Aus Vs Pak T20 Match)​లో ఎలాగైనా గెలిచి ఫైనల్ చేరుకోవాలని అటు ఆస్ట్రేలియా, ఇటు పాకిస్తాన్ పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ టోర్నీ తొలి మ్యాచ్​లో భారత్​పై గెలిచిన పాక్ జట్టు.. దుర్భేద్యంగా మారిపోయింది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. కాగా, ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్​పై ఓడిపోయాక బలంగా పుంజుకుంది. మిగతా నాలుగు మ్యాచ్​ల్లో విజయాలు సాధించి సెమీస్​కు చేరుకుంది. 


Also Read: ICC T20I Rankings: ఐసిసి ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి పడిపోయిన Virat Kohli, 5వ స్థానంలో KL Rahul  


Also Read: Virat Kohli: విరాట్‌ కోహ్లికి బెదిరింపుల విషయంలో హైదరాబాదీ అరెస్టు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook