ICC T20I Rankings: ఐసిసి టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌ని విడుదల చేస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటన చేసింది. ఐసిసి ప్రకటించిన టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) 8వ స్థానానికి పడిపోగా కేఎల్ రాహుల్ 5వ స్థానంలో నిలిచాడు. దీంతో విరాట్ కోహ్లీ నాలుగు స్థానాలు కిందకు దిగజారగా.. కేఎల్ రాహుల్ మరో మూడు స్థానాలు పైకి జంప్ చేసి తన ర్యాంకుని మెరుగుపర్చుకున్నట్టయింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో (ICC T20 World cup 2021) భారత్ ఆడిన చివరి మూడు మ్యాచుల్లోనూ కేఎల్ రాహుల్ అర్థ సెంచరీలు చేశాడు. దీంతో రాహుల్ ర్యాంక్ మెరుగుపడింది.
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో భారత్ ఆడిన తొలి రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆప్ఘనిస్థాన్, స్కాట్లాండ్, నమిబియా జట్లతో జరిగిన మూడు మ్యాచుల్లోనూ కేఎల్ రాహుల్ (KL Rahul) రాణించడం ఒక విధంగా అతడికి ఐసిసి ర్యాంకింగ్స్‌లో తనను తాను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడింది.
After a strong #T20WorldCup campaign, Aiden Markram continues his climb 🧗♂️
Plenty of movement in the @MRFWorldwide T20I player rankings 👉 https://t.co/vJD0IY4JPU pic.twitter.com/Y7tTwgdvPM
— ICC (@ICC) November 10, 2021
Also read : Virat Kohli: విరాట్ కోహ్లికి బెదిరింపుల విషయంలో హైదరాబాదీ అరెస్టు
ఇదే టీ20 ప్రపంచ కప్ టోర్నీలో రాణించిన సౌతాఫ్రికా క్రికెటర్ ఐడెన్ మార్క్రమ్ కూడా ఐసిసి పురుషుల టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు. ఐడెన్ మార్క్రమ్ ఐసిసి బ్యాటర్స్ ర్యాంకింగ్స్ జాబితాలో మూడో స్థానం సొంతం చేసుకోగా.. టాప్ 10 ఆల్ రౌండర్స్ జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. ఐసిసి మెన్స్ టీ20 ఇంటర్నేషనల్ జాబితాలో తొలి మూడు ర్యాంకుల్లో పాకిస్థాన్ కేప్టేన్ బాబర్ ఆజమ్ (Babar Azam), ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ మలన్, సాతాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రమ్ చోటు దక్కించుకున్నారు.
Also read : Syed Mushtaq Ali Trophy: టీ20ల్లో.. నాలుగు మెయిడిన్లు చేసిన ఏకైక బౌలర్ గా 'అక్షయ్' ప్రపంచ రికార్డు!
Also read : Rohit Sharma as T20I Captain: టీమిండియా T20I కేప్టేన్‌గా రోహిత్ శర్మను నియమించిన BCCI
ICC T20I Rankings: 8వ స్థానానికి పడిపోయిన Virat Kohli, 5వ స్థానంలో KL Rahul
ఐసిసి T20I ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి పడిపోయిన విరాట్ కోహ్లీ.
5వ స్థానంలో నిలిచిన కేఎల్ రాహుల్.
4 స్థానాలు వెనుకబడిన కోహ్లీ.. 3 స్థానాలు ముందుకెళ్లిన రాహుల్.