Virat Kohli: విరాట్‌ కోహ్లికి బెదిరింపుల విషయంలో హైదరాబాదీ అరెస్టు

Mumbai cops nab Hyderabad man for rape threat to Virat Kohli's daughter: టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చెందడంతో.. విరాట్‌ కోహ్లిని టార్గెట్‌ చేస్తూ కొందరు దుండగులు అసభ్యకర పోస్టులు చేశారు. కోహ్లి కూతురు వామికాపై అత్యాచారం చేస్తాం అంటూ బెదిరించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2021, 10:19 PM IST
  • విరాట్ కోహ్లీపై బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • టీమిండియా ఓటమి చెందడంతో కోహ్లికి బెదిరింపులు
  • హైదరాబాద్‌కు చెందిన రామ్‌నగేష్‌ అదుపులోకి తీసుకున్న పోలీసులు
Virat Kohli: విరాట్‌ కోహ్లికి బెదిరింపుల విషయంలో హైదరాబాదీ అరెస్టు

Hyderabad-based techie arrested for making online rape threats to Virat Kohli's daughter: విరాట్ కోహ్లీపై బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని
బుధవారం హైదరాబాద్‌లో వారు అదుపులోకి తీసుకున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా (team india) ఓటమి చెందడంతో.. విరాట్‌ కోహ్లిని (virat kohli) టార్గెట్‌ చేస్తూ కొందరు దుండగులు అసభ్యకర పోస్టులు చేశారు. కోహ్లి కూతురు వామికాపై (Virat Kohli's daughter Vamika) అత్యాచారం చేస్తాం అంటూ బెదిరించారు.

Also Read : Boyfriend attacks : ప్రియురాలికి మరో వ్యక్తితో నిశ్చితార్థం.. ప్రియుడి దాడి

ఈ వార్తలను సుమోటోగా తీసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ)... Delhi Council for Women (DCW) డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (క్రైమ్‌)కు నోటీసులు జారీ చేసింది. ఇది చాలా తీవ్రమైన విషయమని, తక్షణ చర్యలు అవసరం పేర్కొంది. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా (team india) ఓటమి అనంతరం పేసర్‌ మహమ్మద్‌ షమిపై ఇలాగే సోషల్‌ మీడియాలో దూషణలకు పాల్పడ్డారు. షమిని సమర్థించినందుకు కోహ్లీపై (Virat Kohli) సోషల్‌ మీడియాలో దాడులు జరిగాయి.

ఇలా బెదిరింపులకు పాల్పడ్డ వారిలో హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల రామ్‌నగేష్‌ (Ramnagesh) కూడా ఉన్నారు. ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నగేష్‌ హైదరాబాద్‌లోని (Hyderabad) ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. గతంలో ఫుడ్‌ డెలివరీ యాప్‌లో పని చేశాడు.

Also Read : Mariyamma lockup death case: మరియమ్మ కేసు విషయంలో హైకోర్టు సీరియస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News