T20 World Cup 2020: టీ20 వరల్డ్ కప్ 2020పై ఎర్ల్ ఎడింగ్స్ కీలక వ్యాఖ్యలు
T20 World Cup 2020 : టీ20 వరల్డ్ కప్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ ( Earl Eddings ) కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ - నవంబర్ మధ్య ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను నిర్వహించడం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఎర్ల్ ఎడింగ్స్ అభిప్రాయపడ్డాడు.
T20 World Cup 2020 : టీ20 వరల్డ్ కప్ 2020పై క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ ( Earl Eddings ) కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ - నవంబర్ మధ్య ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను నిర్వహించడం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఎర్ల్ ఎడింగ్స్ అభిప్రాయపడ్డాడు. యావత్ ప్రపంచాన్ని కరోనావైరస్ ( Coronavirus) పట్టి పీడిస్తున్న ప్రస్తుత తరుణంలో 16 దేశాలకు చెందిన క్రికెటర్లు ఆస్ట్రేలియాకు వచ్చి క్రికెట్ ఆడటం అనేది సాధ్యపడేలా లేదని.. లేదంటే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎడింగ్స్ వ్యాఖ్యానించాడు. మంగళవారం జరిగిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎడింగ్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ( పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటివ్ )
ఐసిసి ( ICC) సైతం ఇప్పుడప్పుడే టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. జూన్ 10న సమావేశమైన ఐసిసి.. ఈ విషయమై జులైలో నిర్ణయం తీసుకుందామనే నిర్ణయానికొచ్చింది. వీలైతే షెడ్యూల్ ప్రకారమే టీ20 వరల్డ్ కప్ నిర్వహించేందుకు ఉన్న అన్ని మార్గాలను ఐసిసి అన్వేషిస్తున్నట్టు కొంతమంది చెబుతున్నప్పటికీ.. అది సాధ్యపడే పరిస్థితి మాత్రం కనిపించడం లేదనే వాళ్లూ లేకపోలేదు. ( IPLకు సిద్ధంగా ఉండాలి: సౌరవ్ గంగూలీ )
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇటీవల మాట్లాడుతూ... 40 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియంలలో జూలై నెల నుంచి 10 వేల మందికి అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు.
బీసీసీఐ ( BCCI ) మాత్రం ఈ విషయంలో భారత ప్రభుత్వం నిర్ణయం మేరకే నడుచుకుంటామంటోంది. టీమిండియాను ఆసిస్‌కు పంపించడమా లేదా అనేది భారత ప్రభుత్వమే నిర్ణయిస్తుందని బీసీసీఐ పేర్కొంది. ఇటీవల బీసీసీఐ అధికారి ఒకరు ఐఏఎన్ఎస్‌తో మాట్లాడుతూ.. '' టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనాలని తమకు కూడా ఉన్నప్పటికీ.. ఆటగాళ్ల రక్షణకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని.. అందుకే నిర్ణయం ఏదైనా భారత సర్కార్ ( Indian govt) చేతుల్లోనే ఉంటుంది " అని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..