T20 WC 2021 India vs Scotland: దుబాయ్​ వేదికగా స్కాట్లాండ్​(scotland)తో జరుగుతున్న మ్యాచ్​లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. మెుదట భారత బౌలర్లు విజృంభిస్తే..అనంతరం బ్యాటర్లు రెచ్చిపోయారు. భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్  17.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ షమీ, జడేజా చెరో మూడు వికెట్లు తీశారు. 85 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెనర్లు రోహిత్, రాహుల్(Rahul) పోటాపోటీగా సిక్సర్లు, ఫోర్లు బాదారు. రోహిత్ 30 పరుగుల చేసి ఔటవ్వగా...రాహుల్ అర్దసెంచరీతో ఆకట్టుకున్నాడు. 86 పరుగుల లక్ష్యాన్ని 6.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెలరేగిన భారత బౌలర్లు..


టాస్(Toss) గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. స్కాట్లాండ్ ఓపెనర్లు జార్జ్‌ మున్సీ, కైల్ కోట్జర్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కెప్టెన్ కైల్ కోట్జర్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్ లో బౌల్డయ్యాడు. అశ్విన్ (Ashwin) బౌలింగ్ లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి... మున్సీ(24) మాంచి ఊపుమీద కనిపించాడు. కాసేపటికే షమీ వేసిన ఓవర్లలో హార్దిక్ పాండ్య చేతికి చిక్కాడు. అనంతరం స్కాట్లాండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. పది ఓవర్ల ముగిసే సమయానికి ఆ జట్టు 44 పరుగులు సాధించింది.


Also read: T20 WC 2021 NZ Vs NAM: నమీబియాపై న్యూజిలాండ్ ఘన విజయం.. సెమీస్‌ రేసులో ముందడుగు..


నిలకడగా ఆడుతున్న మైఖేల్‌ లియాస్క్‌ (21)ను జడేజా(Ravindra Jadeja) వేసిన బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. మ్యాక్‌ లాయిడ్ (16) ఆదుకునే ప్రయత్నం చేసిన షమీ(Shami) బౌలింగ్ లో బౌల్డయ్యాడు. చివర్లో భారత బౌలర్లు విజృంభించటంతో.. 17.4 ఓవర్లలోనే 85 పరుగులకే ఆలౌటైంది. మహమ్మద్‌ షమి, రవీంద్ర జడేజా మూడేసి, బుమ్రా రెండు, రవిచంద్రన్‌ ఒక వికెట్‌ తీశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook