T20 World Cup 2021: T20 World Cup 2021లో వరుసగా రెండవ పరాజయంతో టీమ్ ఇండియా జీరో పాయింట్లతో నిలిచింది. న్యూజిలాండ్‌పై ఓటమితో సెమీస్ ఆశలు ఇండియాకు సన్నగిల్లాయి. అయితే ఇప్పటికీ టీమ్ ఇండియాకు సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయా లేవా అనేది పరిశీలిద్దాం. ఒకవేళ ఉంటే ఎలాగున్నాయో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా (Team India)న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పొందింది. వరుసగా ఈ వరల్డ్‌కప్‌లో(T20 World Cup) రెండవ పరాజయం. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమ్ ఇండియా 7 వికెట్లు కోల్పయి కేవలం 110 పరుగులు మాత్రమే సాధించింది. ఆ తరువాత టార్గెట్ ఛేధించేందుకు బరిలో దిగిన కివీస్ జట్టు కేవలం 14.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. టీమ్ ఇండియా సెమీస్(Team india Semi finals Chances) ఆశలకు నీళ్లు చిమ్మి..తన సెమీస్ ఆశల్ని పదిలం చేసుకుంది. టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఓటమి అనంతరం ఇది రెండవ మ్యాచ్. న్యూజిలాండ్ జట్టు విజయంతో టీమ్ ఇండియా సెమీస్ ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, స్కాట్లండ్, నమీబియాలు గ్రూప్ 2లో ఉన్నాయి. గ్రూప్1,2లలో టాప్ 2 స్థానాల్లో ఉన్న జట్లు సెమీస్‌కు చేరుతాయి. ఇండియా, న్యూజిలాండ్, ఆప్ఘనిస్తాన్‌లపై విజయంతో పాకిస్తాన్ ఇప్పటికే సెమీస్‌కు చేరుకుంది. ఇక మరో జట్టుకు మాత్రమే గ్రూప్ 2 నుంచి సెమీస్‌కు బెర్త్ మిగిలింది. 


పాకిస్తాన్(Pakistan) 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)మూడు మ్యాచ్‌లు ఆడి ఒక విజయంతో 2 పాయింట్లు సాధించింది.  న్యూజిలాండ్ జట్టు ఒక విజయంతో 2 పాయింట్లు సాధించింది. నమీబియా ఒక మ్యాచ్ విజయంతో 2 పాయింట్లతో ఉంది. ఇక ఇండియా, స్కాట్లండ్ జట్లు జీరో పాయింట్లతో 5, 6 స్థానాల్లో ఉన్నాయి. 


ఇండియా సెమీస్ ఆశలు ఉన్నాయా లేవా


గ్రూప్ 2లో చివరి నుంచి రెండవ స్థానంలో ఉన్నా సరే టీమ్ ఇండియాకు ఇప్పటికీ సెమీస్ ఆశలు కొద్దిగా ఉన్నాయనే తెలుస్తోంది. అది కూడా ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడి మాత్రమే. దీనికోసం టీమ్ ఇండియా కచ్చితంగా మిగిలిన మూడు మ్యాచ్‌లలో అంటే ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, స్కాట్లండ్ జట్లపై విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే టీమ్ ఇండియాకు ఇదొక్కటే సరిపోదు సెమీస్‌కు చేరేందుకు. ఇతర జట్ల విజయాలు, రన్‌రేట్ కూడా ఇండియా ఆశలు సజీవంగా ఉన్నాయా లేవా అనేది నిర్ధారిస్తాయి. న్యూజిలాండ్‌కు(Newzealand)మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండింట కచ్చితంగా ఆ దేశం ఓడిపోవల్సి ఉంటుంది. అదే సమయంలో నమీబియా కూడా మిగిలిన మ్యాచ్‌లలో కనీసం రెండింట ఓడిపోవల్సి ఉంటుంది. రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునేందుకు టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ పై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే టీమ్ ఇండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.


Also read: Ind vs NZ Match Highlights: కివీస్ లెగ్ స్పిన్నర్లకు కుప్పకూలిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి