Pakistan Semi final Qualification Scenario After beat South Africa: టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ సత్తాచాటింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో దక్షిణాఫ్రికాను 33 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 185 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 14 ఓవర్లకు 108/9 స్కోరు మాత్రమే చేసింది. ప్రొటీస్ 9 ఓవర్లకు 69/4 స్కోరుతో ఉన్నప్పుడు వర్షం అంతరాయం కలిగించింది. వరుణుడు కనికరించిన అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లకు 142 పరుగులుగా మార్చారు. చివరకు ప్రొటీస్ 33 పరుగుల తేడాతో ఓడిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికాపై విజయంతో పాకిస్తాన్ గ్రూప్‌ 2 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. దాంతో బాబర్ సేన సెమీస్‌ రేసులో నిలిచింది. 6 పాయింట్లతో ((4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఒక ఓటమి) భారత్ అగ్రస్థానంలో ఉండగా.. 5 పాయింట్లతో (4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయం, ఓ మ్యాచ్‌ ఫలితం తేలలేదు) దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. పాక్‌ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో.. 4 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతానికి రన్‌రేట్‌ ప్రకారం చూస్తే పాక్‌ (1.117) జట్టు భారత్‌ (0.730) కంటే మెరుగైన స్థితిలో ఉంది. గ్రూప్‌ 2లోని అన్ని జట్లు చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. 


జింబాబ్వేతో భారత్‌, బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌తో దక్షిణాఫ్రికా తలపడాల్సి ఉంది. జింబాబ్వేపై భారత్ గెలిస్తే గ్రూప్‌ 2 నుంచి తొలి సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా గెలిస్తే సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. నెదర్లాండ్స్ చేతిలో ప్రొటీస్ ఓడినా.. జింబాబ్వే చేతిలో భారత్ ఓడినా పాక్‌ సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే పాక్ బంగ్లాదేశ్‌తో భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. జింబాబ్వే చేతిలో భారత్ ఓడితే మెరుగైన రన్‌రేట్‌ ఆధారంగా పాక్ సెమీస్‌కు చేరుకుంటుంది. భారత్, దక్షిణాఫ్రికా తదుపరి మ్యాచ్‌లు వర్షంతో రద్దయినా.. పాక్‌కు అవకాశం దక్కనుంది. 


Also Read: Rashmika Mandanna Pics: రెడ్ డ్రెస్‌లో కేక పెట్టించిన రష్మిక మందన్న.. శ్రీవల్లి అందాలు అదరహో!


Also Read: కాటుక కళ్లతో కవ్విస్తున్న కాజల్ అగర్వాల్.. తల్లయినా ఇసుమంత కూడా తగ్గని అందం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook