NZ vs PAK: నేడే న్యూజిలాండ్, పాకిస్థాన్ తొలి సెమీస్.. తుది జట్లు, రికార్డ్స్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
NZ vs PAK 1st Semi-Final live s and Playing 11. టీ20 ప్రపంచకప్ 2022 తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి.
T20 World Cup 2022 New Zealand vs Pakistan 1st Semi-Final live streaming: టీ20 ప్రపంచకప్ 2022లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. నేడు జరిగే తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ఐసీసీ టోర్నీల్లో నిలకడకు మారుపేరైన కివీస్.. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ 1లో మొత్తం నాలుగు మ్యాచ్‌లాడిన న్యూజిలాండ్.. మూడింటిలో గెలిచి ఒక దాంట్లో ఓటమి పాలైంది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రైద్దెంది. గ్రూప్ 2 నుంచి అనూహ్యంగా పాకిస్థాన్ సెమీస్‌కు దూసుకొచ్చింది. భారత్, జింబాబ్వేపావు ఓడిన పాక్.. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించింది.
లైవ్ స్ట్రీమింగ్:
న్యూజిలాండ్, పాకిస్థాన్ తొలి సెమీస్ మ్యాచ్ సిడ్నీ మైదానంలో జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు టాస్ పడనుండగా.. 1:30 నుంచి మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలానే డిస్ని ప్లస్ హాట్ స్టార్‌లో కూడా లైవ్ వస్తుంది.
రికార్డ్స్:
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో (1992, 1999, 2007 ) పాకిస్తాన్ గెలిచింది. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కివీస్, పాక్ మధ్య 28 మ్యాచ్‌లు జరగగా.. 17 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ గెలుపొందింది. 11 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ప్రపంచకప్‌లలో 11 సార్లు సెమీ ఫైనల్ చేరిన కివీస్.. మూడుసార్లు మాత్రమే గెలిచింది. ఇది ఆ జట్టును కాస్త పలవరపెట్టే అంశం.
పిచ్:
టీ20 ప్రపంచకప్ 2022లో సిడ్నీలో జరిగిన 6 మ్యాచ్‌ల్లో 5సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. సిడ్నీలో మెగా టోర్నీ కోసం ఉపయోగించిన పిచ్‌లలో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్ ఇదే. ఇదివరకు ఈ పిచ్‌పై కివీస్ ఆడడంతో.. పాక్ కంటే న్యూజిలాండ్‌కే కాస్త అనుకూలం. ఉదయం వర్షం కురిసే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. అయితే మ్యాచ్ సమయానికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా):
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), అలెన్, డెవాన్ కాన్వే, ఫిలిప్స్, మిచెల్, నీషమ్, సాంట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, సోధి, ఫెర్గూసన్.
పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్, నవాజ్, షాదాబ్ ఖాన్, వసీమ్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్.
Also Read: IND vs ENG: వర్షం కారణంగా భారత్, ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్ రద్దైతే.. ఫైనల్ వెళ్లే జట్టేదో తెలుసా?
Also Read: IND vs ENG: డేవిడ్ మలన్ ఔట్.. సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసిన ఇంగ్లండ్! టీమిండియాకు చుక్కలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి