T20 World Cup 2022 Warm-up fixtures Out: ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 టోర్న‌మెంట్‌కు సమయం దగ్గరపడుతోంది. అక్టోబర్ చివరలో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎక్కువగా టీ20లు ఆడుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌కు సంబందించిన వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం ప్రకటించింది. భారత్ రెండు టఫ్ జట్లతో వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబ‌ర్ 17వ తేదీన ఆస్ట్రేలియాతో భారత్ తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబ‌ర్ 19వ తేదీన న్యూజిలాండ్‌తో రోహిత్ సేన త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఈ రెండు పటిష్ట జట్లపై ఆడడం టీమిండియాకు కలిసొచ్చే అంశమే అని చెప్పాలి. ఈ వార్మ‌ప్ మ్యాచ్‌ల‌ను అధికారిక మ్యాచ్‌లుగా గుర్తించ‌రు. ఇక టీ20 ప్రపంచకప్‌ అక్టోబ‌ర్ 16వ తేదీన ప్రారంభం అవుతోంది. తొలి మ్యాచ్ శ్రీలంక‌, న‌మీబియా మ‌ధ్య జరగనుంది. అక్టోబ‌ర్ 23న భారత్ తన తొలి మ్యాచులో పాకిస్తాన్‌తో తలపడనుంది. 


టీ20 ప్రపంచకప్ 2022లో మొత్తం 16 జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే సూపర్ 12 రౌండ్‌కు 8 జట్లు అర్హత సాధించాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు అర్హత సాధించాయి. క్వాలిఫయర్ రౌండ్‌లో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, ఐర్లాండ్, యుఏఈ, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే‌లు తలపడనున్నాయి. ఈ 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపు నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి.


Also Read: క్రేజీ కాంబో.. బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మరో సినిమా! పాన్ ఇండియా లెవల్లో ప్లాన్


Also Read: Bigg Boss 6 Telugu Memes: కడుపుబ్బా నవ్విస్తున్న బిగ్ బాస్ 6 మీమ్స్ చూశారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి