Allu Arjun: క్రేజీ కాంబో.. బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మరో సినిమా! పాన్ ఇండియా లెవల్లో ప్లాన్

Surender Reddy develops a script for Allu Arjun. సురేంద‌ర్ రెడ్డితో రెండో సినిమాకు 'స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ ఒకే చెప్పిన‌ట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 8, 2022, 04:58 PM IST
  • ఆ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మరో సినిమా
  • పాన్ ఇండియా లెవల్లో ప్లాన్
  • క్రేజీ కాంబో
Allu Arjun: క్రేజీ కాంబో.. బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మరో సినిమా! పాన్ ఇండియా లెవల్లో ప్లాన్

Director Surender Reddy working on a script for Allu Arjun: 'స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో 'రేసుగుర్రం' ఒకటి. అప్పటివరకు బ‌న్నీ కెరీర్‌లో చాలా హిట్లు ఉన్నా.. క‌మ‌ర్షియ‌ల్ స్టేట‌స్ మాత్రం రేసుగుర్రం సినిమాతోనే వచ్చింది. ఆ సినిమాలో బన్నీ నటన, డాన్స్, ఫైట్స్ స్టార్ హీరోని చేసాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్ 100 కోట్ల మార్కును అందుకున్నాడు. సురేంద‌ర్ రెడ్డి స్క్రీన్‌ ప్లే, టేకింగ్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్ళాయి. ఈ చిత్రంతో బన్నీకి ఎంత పేరొచ్చిందో.. సురేంద‌ర్ రెడ్డికి కూడా అంతే పేరొచ్చింది. ఈ క్రేజీ కాంబోలో మ‌రో సినిమా వస్తున్నట్లు తెలుస్తుంది.

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ఫ' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. రూ. 350కోట్ల‌కు పైగా గ్రాస్‌ను క‌లెక్ట్ చేసింది. ఈ సినిమాతో బ‌న్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ పుష్ఫ సీక్వెల్‌కు సిద్ధ‌మ‌వుతున్నాడు. భారీ బ్రేక్ తీసుకున్న బన్నీ.. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొననున్నాడు. 

పుష్ఫ 2 త‌ర్వాత 'స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ చేయ‌బోయే తదుపరి సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సురేంద‌ర్ రెడ్డితో రెండో సినిమాకు బ‌న్నీ ఒకే చెప్పిన‌ట్లు ఆ వార్త‌ల సారాంశం. పుష్ఫ 2 త‌ర్వాత ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. సురేంద‌ర్ రెడ్డి ఇప్ప‌టికే ఓ స్క్రీప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడట. ఆ స్క్రీప్ట్‌ పాన్ ఇండియా లెవల్ అని తెలుస్తుంది. మరి ఈ వార్తలో నిజ‌మెంతుందో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. 

Also Read: Man Bites Cobra: రివర్స్ పంచ్.. నాగు పామునే కాటేసిన మనిషి! దెబ్బకు సచ్చిపోయిందిగా

Also Read: Divya Vani to Join BJP: బీజేపీలోకి దివ్యవాణి.. అంతా సిద్ధమే కానీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News