India Vs Bangladesh Match Updates: టీ20 వరల్డ్ కప్‌లో నేడు మరో కీలక పోరు జరగనుంది. బంగ్లాదేశ్‌తో టీమిండియా ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్ గెలిచి సెమీస్‌కు మరింత చేరువ అవ్వాలని భారత్ చూస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌కు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం. టీమిండియా చేతిలో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అడిలైడ్ వేదికగా బుధవారం రెండు జట్లు తలబడబోతున్నాయి. ప్రస్తుతం టీమిండియా 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లతో గ్రూప్ 2లో రెండో స్థానంలో ఉండగా.. ఆడిన మూడు మ్యాచ్‌లో రెండు విజయాలు, ఒక ఓటమితో మూడో స్థానంలో ఉంది బంగ్లాదేశ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేటి మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టుపై అందరి దృష్టి నెలకొంది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు మరోసారి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. స్పెషలిస్ట్ ఓపెనర్ లేకపోడంతో అతని ప్లేస్‌కు ఢోకా లేకపోవచ్చు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన రాహుల్.. బంగ్లాపై అయినా ఫామ్‌లోకి వస్తాడో లేదో చూడాలి. దినేష్‌ కార్తీక్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అతను ఫిట్‌గా లేకపోతే రిషబ్ పంత్ తుది జట్టులోకి రావడం ఖాయం. ఒకవేళ కార్తీక్ సెట్ అయినా.. దీపక్ హుడా స్థానంలో రిషబ్‌ను ఆడించాలని డిమాండ్స్ వస్తున్నాయి. బౌలింగ్‌లో కూడా అశ్విన్ స్థానంలో చాహల్‌ను తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు.


గత మూడు మ్యాచ్‌లో అశ్విన్ గొప్పగా బౌలింగ్ చేసింది లేదు. ముఖ్యంగా గత మ్యాచ్‌లో అశ్విన్ 18వ ఓవర్‌లో భారీగా పరుగులు సమర్పించుకుని టీమిండియా ఓటమికి ఓ కారణం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో అయినా చాహల్‌కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. పేసర్లు భువనేశ్వర్, షమీ, అర్షదీప్ ఆకట్టుకుంటున్నారు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్‌లో బ్యాటర్లదే కీలక పాత్ర. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధిస్తే.. మిగిలిన పని పూర్తి చేయడానికి బౌలర్లు సిద్ధంగా ఉన్నారు.


అటు బంగ్లాదేశ్ జట్టు కూడా మంచి ఫామ్‌లో కనిపిస్తోంది. తాము వరల్డ్ కప్ గెలిచేందుకు రాలేదని.. భారత్‌ను ఓడించేందుకే వచ్చామంటూ బంగ్లా కెప్టెన్ షకిబుల్ హాసన్ ఇప్పటికే హెచ్చరిక పంపాడు. అతను మాటలు చూస్తుంటే.. టీమిండియాతో మ్యాచ్‌కు గట్టిగా సన్నద్దమై వచ్చినట్లు ఉన్నారు. అతనికితోడు అఫిఫ్‌ హుస్సేన్‌, మొసాదెక్‌ హొస్సేన్‌, సౌమ్య సర్కార్‌ వంటి స్టార్ ఆల్‌రౌండర్లతో ఆ జట్టు బలంగానే ఉంది. పేసర్‌ తస్కిన్‌ అహ్మద్‌ ఈ టోర్నీలో సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నారు. మరో పేసర్ ముస్తాఫిజుర్ ఎప్పటికైన ప్రమాదకారే. నజ్ముల్‌ శాంటో మంచి ఫామ్‌లో ఉండటం బంగ్లాకు కలిసి వచ్చే అంశం. లిటన్‌ దాస్‌ ఎప్పుడైనా రెచ్చిపోగలడు. నెదర్లాండ్స్, జింబాబ్వే జట్లను ఓడించి ఆ జట్టు మంచి ఊపులో ఉంది. ఏ మాత్రం చిన్న అవకాశం వచ్చినా.. భారత్‌కు షాక్ ఇచ్చేందుకు బంగ్లా రెడీగా ఉంది.


Also Read: KL Rahul-Virat Kohli: కేఎల్ రాహుల్‌ ఫ్లాఫ్ షో.. రంగంలోకి దిగిన విరాట్ కోహ్లీ!


Also Read: Google Chrome Update: మీ గూగుల్ క్రోమ్ అప్‌డేట్ చేశారా..లేకపోతే ఇంతే సంగతులు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook