MI Vs RR Live: టాటా ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఘోర వైఫల్యం చెందుతోంది. వరుసగా మూడో పరాజయం పాలవగా.. రాజస్థాన్‌ రాయల్స్‌ హ్యాట్రిక్‌ విజయం సొంతం చేసుకోవడం విశేషం. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటిన రాజస్థాన్‌ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌ జట్టు 6 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించి పట్టికలో మొదటి స్థానం సొంతం చేసుకుంది. వరుస పరాజయాలతో ముంబై ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IPL DC Vs CSK Live: చెన్నైకి ఢిల్లీ షాక్‌.. చాన్నాళ్లకు ధోనీ మెరిసినా తప్పని ఓటమి


 


టాస్‌ గెలిచి బౌలింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుతం చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో చావు దెబ్బ తిన్న ముంబై ఇండియన్స్‌ను ఉతికి ఆరేసింది. అటు బౌలింగ్‌లోనూ.. ఇటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టి ఈ సీజన్‌లో ఏ జట్టు చేయనట్టు హ్యాట్రిక్‌ విజయాలను సొంతం చేసుకుంది. రియాన్‌ పరాగ్‌ తనదైన బ్యాటింగ్‌తో మంచి విజయం సాధించింది.

Also Read: KL Rahul Parent: కేఎల్‌ రాహుల్‌ తండ్రి కాబోతున్నాడా? పిల్లనిచ్చిన 'మామ' ఆసక్తికర వ్యాఖ్యలు


 


మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి చేదు అనుభవం ఎదురైంది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులుచేసింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (16) పర్వాలేదనిపించగా.. రోహిత్‌ శర్మ, నమన్‌ ధిర్‌, డేవాల్డ్‌ బ్రెవిస్‌ ఒక్క పరుగు సాధించకుండా మైదానం వీడడం ఈ సీజన్‌లో తొలిసారి. ఐపీఎల్‌ చరిత్రలో ఇది ఆరోసారి. జట్టు తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో మిడిలార్డర్‌లో వచ్చిన తెలంగాణ ఆటగాడు (32), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (34) బ్యాట్‌ ఝుళిపించడంతో స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది. టిమ్‌ డేవిడ్‌ (17), గెరాల్డ్‌ కాటెజ్‌ (4), జస్ప్రీత్‌ బుమ్రా (8), ఆకాశ్ మధ్వాల్‌ (4) కొంత పరుగులు జోడించారు. ముంబైను గుజరాత్‌ బౌలర్లు చెడుగుడు ఆడేసుకున్నారు. సీనియర్‌ బౌలర్‌ యజవేంద్ర చాహల్‌ బంతులతో ముంబైపై విరుచుకుపడ్డాడు. 11 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రెంన్ట్‌ బౌల్ట్‌ కూడా 3 వికెట్లు తీయడం విశేషం. నంద్రె బర్గర్‌ రెండు వికెట్లు, ఆవేఖాన్‌ ఒక వికెట్‌ తీశాడు.


బ్యాటర్లు విఫలమవడంతో అతి స్వల్ప లక్ష్యాన్ని కాపాడడంలో ముంబై బౌలర్లు విఫలమయ్యారు. వరుసగా రెండు విజయాలతో దూకుడు మీద ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా సాధించి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. 4 వికెట్లు కోల్పోయి 15.3 బంతుల్లోనే రాజస్థాన్‌ రాయల్స్‌ సాధించి హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబై మాదిరి కూడా బ్యాటింగ్‌లో టాపార్డర్‌ విఫలమైంది. యశస్వి జైశ్వాల్‌ (10), జోస్‌ బట్లర్‌ (13), కెప్టెన్‌ సంజు శామ్‌సన్‌ (12) తక్కువ స్కోర్‌కు పరిమితమయ్యాడు. ఈ సమయంలో యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ దూసుకొచ్చి బ్యాట్‌తో బీభత్సం సృష్టించాడు. 39 బంతుల్లో 54 పరుగులు చేసి రాజస్థాన్‌కు మూడో విజయాన్ని అందించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (16), శుభమ్‌ దుబే (8) కొంత పరుగులు జోడించారు. పవర్‌ ప్లేలో సత్తా చాటిన ముంబై బౌలర్లు తర్వాత ముంబైని పరుగులు రాబట్టకుండా నియంత్రించలేకపోయారు. ఆకాశ్‌ మధ్వాల్‌ 3 వికెట్లు తీయగా.. క్వెనా మఫాక ఒక వికెట్‌ తీశాడు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook