RCB Vs LSG Live Updates: సమష్టి కృషితో లక్నో సూపర్‌ జియాంట్స్‌ అద్భుతం చేసి రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో కట్టుదిట్టంగా ఆడిన లక్నో 28 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై విజయం సాధించింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని అంశాల్లో దూకుడుగా కనిపించి దీటుగా ఆడిన లక్నో కీలక మ్యాచ్‌ను చేజిక్కించుకుని పాయింట్ల పట్టికలో నెట్‌ రన్‌రేట్‌ మెరుగుపర్చుకుంది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన బెంగళూరు రెండో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఆరంభమే టాపార్డర్‌ గతి తప్పగా.. మిడిలార్డర్‌ కూడా చేతులెత్తేసింది. ఆ సమయంలో వచ్చిన లమ్‌రోర్‌ తన శక్తిమేర ప్రయత్నించినా బెంగళూరుకు నిరాశ తప్పలేదు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IPL DC Vs CSK Live: చెన్నైకి ఢిల్లీ షాక్‌.. చాన్నాళ్లకు ధోనీ మెరిసినా తప్పని ఓటమి


టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. క్వింటాన్‌ డికాక్‌ బ్యాటింగ్‌తో బీభత్సం సృష్టించాడు. 56 బంతుల్లో 81 పరుగులు (8 ఫోర్లు, 6 సిక్స్‌లు) చేసి జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (20) కొన్ని పరుగులే చేయగా.. దేవదత్‌ పడిక్కల్‌ ఆరు పరుగులకే పరిమితమయ్యాడు. మార్కస్‌ స్టోయినిస్‌ (24) పరవాలేదనిపించగా.. నికోలస్‌ పూరన్‌ (40) స్కోర్‌బోర్డులో భారీగానే పరుగులు ఇచ్చాడు. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుకు లక్నో సాధారణ లక్ష్యం విధించింది. సొంత మైదానంలో లక్నోను పరుగులు రాబట్టకుండా బెంగళూరు బౌలర్లు కట్టడి చేశారు. పొదుపుగా బంతులు వేస్తూ వికెట్లు పడగొట్టారు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ రెండు వికెట్లు తీసి సత్తా చాటగా.. రెకీ టోప్లే, యశ్‌ దయాల్‌, మహ్మద్‌ సిరాజ్‌ చెరొక వికెట్‌ తీశారు. 

Also Read: RCB vs KKR Live Score: విరాట్‌ కోహ్లీ శ్రమ వృథా.. కేకేఆర్‌ చేతిలో బెంగళూరు బోల్తా


లక్నో విధించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో బెంగళూరు విఫలమైంది. బౌలింగ్‌లో సత్తా చాటగా.. బ్యాటింగ్‌తో తడబాటుకు గురైంది. బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ 153 పరుగులు చేసి 19.4 ఓవర్లకు మహిపాల్‌ లమ్‌రోర్‌ మినహా మిగతా వారంతా తక్కువ స్కోరు సాధించారు. ఆరంభమే విరాట్‌ కోహ్లీ (22), కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (19) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. కానీ లక్నో బౌలర్లకు చిక్కారు. రజత్‌ పాటిదార్‌ 29 పరుగులు తీసి సత్తా చాటగా.. మాక్స్‌వెల్‌ డకౌట్‌ కావడం గమనార్హం. కామెరూన్‌ గ్రీన్‌ (9), అనూజ్‌ రావత్‌ (11), మయాంక్‌ దగర్‌ (0) అతి తక్కువ స్కోర్‌ సాధించారు. మహిపాల్ లమ్‌రోర్‌ నిలకడగా గ్రౌండ్‌లో నిలబెట్టి జట్టు విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. 12 బంతుల్లో 33 పరుగులు (3 ఫోర్లు, 3 సిక్స్‌లు) సాధించి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. మహ్మద్‌ సిరాజ్‌ 12 పరుగులు చేసి బ్యాట్‌తో మెరిశాడు. 


అద్భుత బౌలింగ్‌తో బెంగళూరును లక్నో బౌలర్లు కట్టడి చేశారు. మయాంక్‌ యాదవ్‌ తన బౌలింగ్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. నవీన్‌ ఉల్‌ హక్‌ రెండు వికెట్లు, సిద్ధార్థ్‌, యశ్‌ ఠాకూర్‌, మార్కస్‌ స్టోయినిస్‌ చెరో వికెట్‌ తీసి బెంగళూరును మట్టుబెట్టారు. కాగా ఆటగాళ్లు చివరి వరకు ఆడి నెట్‌ రన్‌రేట్‌ తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. బంతులు ఉన్నా చేతిలో వికెట్లు లేకపోవడంతో ఆర్‌సీబీ ఓటమి వైపు నిలబడింది. ఈ ఓటమితో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి