Team India All-rounder Krunal Pandya steps down as Baroda Team captain: టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా (Krunal Pandya) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే దేశవాళీ సీజల్‌లో బరోడా (Baroda) జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కృనాల్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు బరోడా క్రికెట్ అసోసియేషన్ (BCA) అధ్యక్షుడు ప్రణవ్ అమిన్‌కు శుక్రవారం సాయంత్రం ఇమెయిల్ ద్వారా 30 ఏళ్ల కృనాల్ సమాచారం ఇచ్చాడు. బరోడా కెప్టెన్‌గా (Baroda Team captain) తాను తప్పుకున్నా.. ఆటగాడిగా మాత్రం అందుబాటులో ఉంటానని తెలిపాడు. జట్టు ప్రయోజనాల కోసం తన వంతు కృషి చేస్తానని కృనాల్‌ పేర్కొన్నాడు. సెలక్టర్లతో విభేదాలు తలెత్తిన కారణంగానే కృనాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ప్రస్తుత దేశీయ సీజన్‌లో బరోడా జట్టు (Baroda Team)కు నాయకత్వం వహించబోను. అయితే సెలక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటాను. ఓ ఆటగాడిగా కొనసాగుతా. బరోడా క్రికెట్‌కు ఆటగాడిగా నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను. నా మద్దతు మరియు సహకారం ఎల్లప్పుడూ జట్టుకు ఉంటుంది' అని కృనాల్‌ పాండ్యా (Krunal Pandya) తన ఇమెయిల్‌లో రాసాడని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.  దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ జట్టు ఎంపిక విషయంలో బీసీఏ సెలక్టర్లతో విభేదాలు తలెత్తిన కారణంగానే కృనాల్‌ బరోడా జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం తెలుస్తోంది. 


Also Read: KS Bharat: వచ్చీరాగానే సూపర్ క్యాచ్ అందుకున్న కేఎస్ భరత్.. రహానేని ఒప్పించి మరీ (వీడియో)!


ఇటీవల ముగిసిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ (Syed Mushtaq Ali Trophy) టీ20 ట్రోఫీలో కృనాల్‌ పాండ్యా (Krunal Pandya) సారథ్యంలోని బరోడా జట్టు విఫలమైంది. ఆడిన ఐదు మ్యాచులో కేవలం ఒకటి మాత్రమే గెలిచి.. గ్రూపు-బిలో చివరి స్థానంలో నిలిచింది. దాంతో నాకౌట్‌కు అర్హత సాధించడంలో బరోడా జట్టు విఫలమైంది. ఆటగాడిగా కూడా కృనాల్‌ పెద్దగా రాణించలేదు. ఐదు మ్యాచులో కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లో 5.94 ఎకానమీతో ఐదు వికెట్లు పడగొట్టాడు. పాండ్యా రెండు సీజన్‌ల క్రితం కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే కెప్టెన్‌గా అతని హయాంలో వివాదాలలే ఎక్కువగా ఉన్నాయి. కృనాల్ కారణంగా దీపక్ హుడా (Deepak Hooda) రాజస్థాన్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. 


Also Read: Trivikram : డైరెక్టర్ త్రివిక్రమ్ ట్వీట్ గురించి మంత్రి పేర్ని నానికి రిప్లై


కృనాల్‌ పాండ్యా బరోడా జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో.. కేదార్‌ దేవ్‌ధర్‌ (Kedar Devdhar)కు బీసీఏ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దేవ్‌ధర్ గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. దేవ్‌ధర్‌ మంచి ఆటగాడు మాత్రమే కాకుండా అంతకుమించి నాయకత్వ లక్షణాలు ఉన్న ప్లేయర్. వచ్చే నెలలో జరగనున్న విజయ్ హజారే ట్రోఫీకి ఎడమచేతి వాటం స్పిన్నర్ భార్గవ్ భట్‌ ( Bhargav Bhatt)ని వైస్ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook