IND vs NZ 1st Test: Substitute keeper KS Bharat takes Super Catch to dismiss Will Young: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ ఎట్టకేలకు తొలి వికెట్ పడగొట్టింది. సెంచరీ దిశగా దూసుకెళుతున్న న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ (Will Young) (89)ను టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఔట్ చేశాడు. అయితే ఈ వికెట్ యాష్ ఖాతాలో పడడానికి కారణం యువ వికెట్ కీపర్ కేఎస్ భరత్ (KS Bharat) అనే చెప్పాలి. సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్‌ట్యూట్‌గా వచ్చిన భరత్.. వచ్చీరాగానే సూపర్ క్యాచ్ అందుకున్నాడు. కెప్టెన్ అజింక్య రహానేను ఒప్పించి మరీ రివ్యూ తీసుకుని సక్సెస్ అయ్యాడు. అసలు విషయంలోకి వెళితే..
తొలి టెస్ట్ ఆడుతున్న వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha)కు రెండో రోజు ఆటలో మెడ నరాలు పట్టాయి. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మెడికల్ టీమ్ సాహాకు చికిత్స అందిస్తోంది. సాహాకు చికిత్స జరుగుతోందని, అతని స్థానంలో తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ కీపింగ్ చేస్తాడని శనివారం ఉదయం బీసీసీఐ తన ట్విట్టర్‌లో పేర్కొంది. దాంతో మూడోరోజు సబ్‌స్టిట్యూట్ కీపర్‌గా భరత్ (Substitute keeper KS Bharat) మైదానంలోకి వచ్చాడు. వచ్చీరాగానే అతడు ఓ అద్భుతమైన క్యాచ్ (Super Catch) అందుకున్నాడు. ఇన్నింగ్స్ 66 ఓవర్ వేసిన ఆర్ ఆశ్విన్ బౌలింగ్‌లో.. కివీస్ ఓపెనర్ విల్ యంగ్ బ్యాట్‌ను తాకిన బంతి భరత్ చేతుల్లోకి వెళ్లింది. ఔట్ కోసం ఆప్పీల్ చేయగా అంపైర్ దాన్ని తిరస్కరించాడు.
Gutkha Man: ప్లకార్డుతో ప్రత్యక్షమైన కాన్పూర్ 'గుట్కా మ్యాన్'-ఈసారి మంచి మెసేజ్‌తో వచ్చాడు
అది కచ్చితంగా బ్యాట్ అంచును తాకింది అంటూ.. కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane)ను కేఎస్ భరత్ ఒప్పించాడు. కెప్టెన్ సహాయంతో అతడు రివ్యూకు వెళ్లాడు. రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు సృష్టంగా తేలింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనుక్కు తీసుకుని.. ఔట్‌గా ప్రకటించాడు. దీంతో ఎట్టకేలకు భారత్ ఖాతాలో వికెట్ చేరింది. నిన్నటి నుంచి భారత బౌలర్లను సతాయించిన విల్ యంగ్ ఔట్ అవ్వడంతో టీమిండియా ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. భరత్‌ను ప్రశంశలతో ముంచెత్తారు. సాహా బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను కేవలం ఒక పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. దాంతో భరత్‌ను జట్టులోకి తీసుకోవాలంటూ ఫాన్స్ కోరుతున్నారు. వికెట్ కీపర్‌గా రాణిస్తున్న మరో యువ ప్లేయర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ను బీసీసీఐ ఈ టెస్ట్ సిరీస్‌కు దూరం పెట్టిన విషయం తెలిసిందే.
SS Rajamouli: పునీత్ రాజ్‌కుమార్ అలాంటివాడు కాదు.. ఆ విషయం ఎవరికీ చెప్పలేదు: రాజమౌళి
మొదటి టెస్టు మూడో రోజు తొలి సెషన్ పూర్తయింది. 129/0 ఓవర్ నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ బోజనవిరామ సమయానికి 197/2 స్కోరుతో నిలిచింది. కివీస్ ఇంకా 148 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. విల్ యంగ్ 89 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18), టామ్ లేథమ్ (82)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో విలియమ్సన్ ఎల్బీగా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో ఆర్ అశ్విన్ (R Ashwin), ఉమేశ్ యాదవ్ (Umesh Yadav) తలో వికెట్ తీశారు.
— Maqbool (@im_maqbool) November 27, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook