Virat Kohli Test Career: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ కెరీర్‌లో అరుదైన మైలురాయిపైనే అందరి దృష్టీ నెలకొంది. విరాట్ కోహ్లీ శ్రీలంక టెస్టు సిరీస్‌తో వందవ టెస్ట్ ఆడబోతున్నాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ..క్రికెట్ కెరీర్‌లో రేపు కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. కెరీర్‌లో వందవ టెస్ట్ మ్యాచ్ రేపు ఆడనున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ ఇందుకు వేదికకానుంది. ఈ సందర్భంగా అందరి దృష్టీ ఈ మ్యాచ్‌పైనే ఉంది. అటు అభిమానులు ఇటు టీమ్ ఇండియా క్రికెటర్లు అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం వందవ టెస్ట్‌లో విరాట్ సెంచరీ కొట్టాలని..మ్యాచ్ చూసేందుకు వస్తున్నానని వ్యాఖ్యానించడం విశేషం.


ఇటు అభిమానుల్నించి కూడా ఇదే కోరిక వ్యక్తమవుతోంది. వందవ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాలని ఆశలు పెట్టుకున్నారు. కోహ్లీ వందవ టెస్ట్ మ్యాచ్ చూడాలనే అభిమానుల కోరికను బీసీసీఐ మన్నించి..ప్రేక్షకులకు అనుమతిచ్చింది. 2011లో టెస్ట్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీకు వంద టెస్ట్‌లు పూర్తవడానికి 11 ఏళ్లు పట్టింది. ఎంఎస్ ధోనీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తరువాత టీమ్ ఇండియాను విజయపధంలో నడిపించాడు.టెస్ట్ కెప్టెన్లలో అత్యధిక విజయాలు అందుకున్న సారధిగా రికార్డు సాధించాడు. అటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టీమ్‌లను సొంతగడ్డపై ఓడించి..సిరీస్ కైవసం చేసుకున్న ఘనత కూడా విరాట్ దక్కించుకున్నాడు. ఇప్పటి వరకూ 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి..7 వేల 962 పరుగులు సాధించాడు. ఇందులో 27 సెంచరీలున్నాయి.



విరాట్ కోహ్లీ వంద టెస్ట్‌ల నేపధ్యంలో బీసీసీఐ విడుదల చేసిన చిన్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వంద టెస్ట్ మ్యాచ్‌లు ఆడతానని తాను ఊహించలేదని విరాట్ కోహ్లీ తెలిపాడు.  క్రికెట్‌లో అడుగుపెట్టడానికి ముందే..భారీ స్కోర్లు చేయాలనేది తన లక్ష్యంగా ఉండేదని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండటం ద్వారా..ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలనే ఆలోచన ఉండేదని..కొన్నిసార్లు విఫలమైనా..చాలాసార్లు విజయవంతమయ్యానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వందవ టెస్ట్ పూర్తయితే..12వ ఆటగాడిగా నిలుస్తాడు. గతంలో సచిన్, ద్రావిడ్, గంగూలీ, సెహ్వాగ్ వంటి క్రికెటర్లు టీమ్ ఇండియా తరపున వంద టెస్ట్ మ్యాచ్‌లు పూర్తి చేశారు. అదే సమయంలో మరో టెస్ట్ మ్యాచ్‌లలో 8 వేల పరుగుల మైలురాయికి 38 పరుగుల దూరంలో నిలిచాడు.


Also read: IND vs SL Playing XI: గిల్, శ్రేయస్‌లకు చోటు.. తెలుగు ఆటగాడికి నిరాశే! శ్రీలంకతో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook