Team India: ఆసియా కప్ 2022 ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీలో టీమ్ ఇండియా ఇద్దరు కీలక ఆటగాళ్లకు దూరమౌతోంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా కప్ప 2022 కు రోహిత్ శర్మ సారధ్యంలోని టీమ్ ఇండియా సన్నద్ధమైంది. ఆగస్టు 27న ప్రారంభం కానున్న ఈ టోర్నీలో టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆగస్టు 28న ఉంది. యూఏఈలో జరగనున్న ఈ టోర్నమెంట్ కోసం బీసీసీఐ 15 మంది ఆటగాళ్లతో టీమ్ సిద్ధం చేసింది. ముగ్గురు స్టాండ్ బైలో ఉండనున్నారు. అయితే మొత్తం 15 మంది సభ్యుల టీమ్‌లో ఇద్దరు కీలకమైన ఆటగాళ్లు దూరమయ్యారు. ఈ ఇద్దరు ఈ మెగా టోర్నమెంట్‌లో పాల్గొనడం లేదు. ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకపోవడం ఇండియాకు పెద్ద లోటే.


ఆసియా కప్ 2022లో టీమ్ ఇండియా జట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు స్థానం సంపాదించుకున్నారు. కానీ మరో ఇద్దరు పేస్ బౌలర్లు హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బూమ్రా స్థానం సంపాదించుకోలేదు. గాయం కారణంగా ఈ ఇద్దరూ టీమ్ ఇండియా నుంచి దూరమయ్యారు. ఈ ఇద్దరూ టీమ్ ఇండియాను చాలా సందర్భాల్లో గట్టెక్కించిన పరిస్థితి. ఈ ఇద్దరూ లేకపోడవం టీమ్ ఇండియాకు లోటుగానే ఉంటుంది.


సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బూమ్రా ఇంగ్లండ్ పర్యటన నుంచే బ్రేక్‌లో ఉన్నాడు. ప్రస్తుతం అమెరికాలో వెకేషన్ గడుపుతున్నాడు. జస్‌ప్రీత్ బూమ్రా వీపుకు గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. అటు హర్షల్ పటేల్ వెస్టిండీస్ పర్యటనలో గాయపడ్డాడు. వెస్టిండీస్‌కు వ్యతిరేకంగా 5 టీ20 మ్యాచ్‌లలో హర్షల్ పటేల్ ఆడాడు. గాయం కారణంగా ఇదే సిరీస్‌లో ఒక మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు ఆసియా కప్‌కు కూడా ఎంపిక కాలేదు.


జస్‌ప్రీత్ బూమ్రా, హర్షల్ పటేల్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహార్సల్స్‌లో ఉన్నారు. ఈ ఇద్దరూ గాయం నుంచి కోలుకుంటే..ఆసియా కప్ తరువాతే టీమ్ ఇండియాలో పాల్గొనవచ్చు. టీమ్ ఇండియా ఇదే ఏడాది టీ20 ప్రపంచకప్ కూడా ఆడాల్సి ఉంది. కానీ హర్షల్ పటేల్ గాయం తీవ్రమైందిగా తెలుస్తోంది. 


ఆసియా కప్‌కు టీమ్ ఇండియా జట్టు


రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిశ్నోయి, భువనేశ్వర్ కుమార్, హర్షదీప్ సింహ్, ఆవేశ్ ఖాన్


Also read: ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసిన ఐసీసీ..టీమిండియా స్థానం ఎంతంటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook