IND vs WI: భారత్ ఖాతాలోకి మరో సిరీస్‌ చేరింది. ఇప్పటికే ఇంగ్లండ్‌లో టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియా కైవసం చేసుకుంది. తాజాగా వెస్టిండీస్‌లో వన్డే సిరీస్‌ సైతం ఖాతాలో చేరింది. నిన్న పోర్ట్ ఆఫ్‌ స్పెయిన్ వేదికగా విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో యువ భారత్ జయకేతనం ఎగురవేసింది. ఉత్కంఠ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇంకో మ్యాచ్‌ ఉండగానే 2-0 తేడాతో వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలో భారత్ జట్టు సరికొత్త రికార్డును సృష్టించింది. వెస్టిండీస్‌పై టీమిండియా వరుసగా 12వ వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2006 నుంచి ఇప్పటివరకు ఆ జట్టుతో జరిగిన ప్రతి సిరీస్‌ను భారత్ దక్కించుకుంది. 2006తో మాత్రం టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. 1-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. అప్పటి నుంచి విండీస్‌పై టీమిండియా కసిగా ఆడుతోంది. తాజాగా మరో సిరీస్‌ను ముద్దాడింది. 


ఇటు వరుసగా 11 వన్డే సిరీస్‌లను గెలుచుకున్న జట్టుగా పాకిస్థాన్‌ ఉంది. జింబాబ్వేపై ఆ జట్టు 1996 నుంచి 2021 వరకు ఈ ఫీట్ సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును భారత్ అధిగమించింది. తన పేరిట సరికొత్త రికార్డును నెలకొల్పింది. మరోవైపు టీమిండియా ఆటగాళ్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. మ్యాచ్‌ అనంతరం ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈవిడియోలను కెప్టెన్ ధావన్‌ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. 


వీడియోకు టాలెంట్ మ్యాచ్‌లను గెలిపిస్తుంది..కానీ టీమ్ వర్క్, ఇంటెలిజెన్స్ ఛాంపియన్ షిప్‌ను తీసుకొస్తుందని క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. వీడియోలో టీమిండియా ఆటగాళ్లంతా ఫుల్ జోష్‌తో సంబరాలు చేసుకున్న దృశ్యాలు కనిపించాయి. 



Also read:Rain Alert: కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..రాగల మూడురోజులు బీఅలర్ట్..!


Also read:Monkeypox India: దేశంలో మంకీపాక్స్ కలకలం.. లక్షణాలు ఏంటి, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.