India vs West Indies: వెస్టిండీస్‌ గడ్డపై భారత జట్టు విశేషంగా రాణిస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఐదు టీ20ల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈమ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కాస్త తడబడినా..ఫీల్డింగ్, బౌలింగ్‌లో టీమిండియా అదుర్స్ అనిపించింది. యువ ఆటగాళ్లంతా తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాబోయే టీ20 వరల్డ్ కప్‌యే టార్గెట్‌గా భారత జట్టు కూర్పును తీర్చిదిద్దుతున్నారు. ఈక్రమంలో కెప్టెన్‌లను, ఆటగాళ్లను జట్టు యాజమాన్యం మారుస్తోంది. కరేబియన్‌ మైదానాల్లో టీమిండియా యువ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. అన్ని విభాగాల్లో అలరిస్తున్నాయి. తాజాగా తొలి టీ20 మ్యాచ్‌లో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మెరుపు ఫీల్డింగ్ చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కెప్టెన్ పూరన్ భారీ షాట్స్‌లకు ప్రయత్నిస్తున్నాడు.


ఈనేపథ్యంలో అశ్విన్ వేసిన బంతిని సిక్సర్ కొట్టేందుకు పూరన్ భారీ షాట్‌ ఆడాడు. బంతి గాల్లోకి వెళ్లింది. అది సిక్సర్ అని అందరూ అనుకున్నాడు. ఐతే బౌండరీ లైన్ దగ్గర ఉన్న శ్రేయస్ అయ్యర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు. తెలివిగా బంతిని పట్టుకుని మైదానంలోకి విసేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టు కేవలం రెండు పరుగులతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం మెరుపు ఫీల్డింగ్‌కు ఫిదా అవుతున్నారు. విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.



Also read:Karvy Scam: కార్వీ కేసులో ఈడీ విచారణ స్పీడప్..రూ.110 కోట్ల ఆస్తుల అటాచ్..!


Also read:Sahiti Infratec: హైదరాబాద్‌లో సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ నిర్వాకం..ప్లాట్ల పేరుతో భారీ మోసం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook