IND vs ZIM: జింబాబ్వే గడ్డపై భారత్ యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఏ స్థానంలో వచ్చినా తన బ్యాట్‌ను ఝలిపిస్తున్నాడు. తాజాగా మూడో వన్డేలో అద్భుతంగా రాణించాడు. తన తొలి అంతర్జాతీయ వన్డే సెంచరీ చేశాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

97 బంతుల్లో 130 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. సెంచరీ ద్వారా సరికొత్త రికార్డును సృష్టించాడు. వన్డేల్లో జింబాబ్వేపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దిగ్గజ ప్లేయర్ సచిల్ టెండూల్కర్ పేరుపై ఉంది. 1998లో బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో అతడు 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈరికార్డు గిల్ బ్రేక్ చేశాడు.


మూడో వన్డేలో 130 పరుగులు చేసి..సచిన్ 24 ఏళ్ల రికార్డును అధిగమించాడు. ఇప్పటివరకు జింబాబ్వేపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ప్లేయర్లు ఆరుగురు ఉన్నారు. ఇందులో శుభ్‌మన్‌ గిల్‌దే అత్యధిక స్కోర్ 130 పరుగులు. ఆ తర్వాత సచిన్ 127 నాటౌట్, అంబటి రాయుడు 124, యువరాజ్‌ సింగ్ 120. శిఖర్ ధావన్ 116 పరుగులు సాధించారు. మొత్తంగా జింబాబ్వే గడ్డపై వన్డే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఈమ్యాచ్‌లో జింబాబ్వే గట్టి పోటీ ఇచ్చినా..భారత్‌కే విజయం వరించింది.





Also read:Venkat Reddy: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ మారుతున్నారా..సోనియా గాంధీకి ఘాటు లేఖ..!


Also read:IND vs ZIM: ఆఖరి వన్డేలో చెమటోడ్చి గెలిచిన టీమిండియా..సిరీస్ క్లీన్‌స్వీప్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి