ICC World Test Championship 2023 Final Team India: ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఐపీఎల్‌లో అదరగొడుతున్న అజింక్య రహానేకు ఊహించినట్లే మళ్లీ పిలుపువచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రహానే అనుభవం ఉపయోగపడుతుందని బీసీసీఐ భావించింది. గాయపడిన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రహానే టెస్టు టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్‌ కిషన్‌ను పక్కనబెట్టారు. వికెట్‌ కీపర్‌గా కేఎస్ భరత్ ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌లో జూన్ 7వ తేదీ నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ ప్రారంభంకానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్‌ను టెస్టు టీమ్‌ నుంచి పక్కనపెట్టారు. అయితే ఆసీస్‌పై పేలవ ప్రదర్శన చేసినా.. కేఎల్ రాహుల్‌ మాత్రం తన స్థానం నిలబెట్టుకున్నాడు. మిడిల్‌ ఆర్డర్ కాస్త బలహీనంగా ఉండడంతో కేఎల్ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించి.. మిడిల్ ఆర్డర్ ఆడించే అవకాశం కూడా ఉంది. ఆసీస్‌ వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లోనే ఆకట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ కూడా టెస్టు టెస్టు జట్టులోకి తిరిగివచ్చాడు. 


బౌలింగ్ విభాగంలో ముగ్గురు స్పిన్నర్లకు చోటు కల్పించింది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. కుల్దీప్ యాదవ్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పించారు. ఇంగ్లాండ్ పరిస్థితులు పేస్‌కు అనుకూలంగా ఉంటాయి. దీంతో షమీ, సిరాజ్‌, ఉమేష్ యాదవ్‌, జయదేవ్ ఉనద్కత్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు 17 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఆస్ట్రేలియా ప్రకటించిన విషయం తెలిసిందే. 


Also Read: SRH Vs DC Highlights: ఇంట్రెస్టింగ్ సీన్.. భువనేశ్వర్ కాళ్లు పట్టుకున్న డేవిడ్ వార్నర్..!


డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.


 



ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్షా, మిచెల్ స్టార్క్. 


Also Read: IPL 2023: ఐపీఎల్ ఆడని దిగ్గజ క్రికెటర్లు.. ఆ ఐదుగురు ఎవరంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook