IND vs ENG: టీమిండియా బిగ్ షాక్.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఆ స్టార్ పేసర్ దూరం!
Team India: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకు భారీ షాక్ తప్పేలా లేదు. భారత స్టార్ పేసర్ షమీ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో అతడు తొలి రెండు టెస్టులు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IND vs ENG Test Series 2024: త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడబోతుంది టీమిండియా. అయితే ఈ సిరీస్ కు ముందు భారత్ కు భారీ షాక్ తప్పేలా లేదు. ఎందుకంటే వన్డే ప్రపంచకప్ హీరో మహ్మద్ షమీ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడమే దీనికి కారణం. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు అతడిని ఎంపిక చేసినా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు షమీ. దీంతో అతడు ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండేది డౌటేనని బీసీసీఐ వర్గాలు ద్వారా తెలుస్తున్న సమాచారం. వరల్డ్ కప్‌లో గాయపడ్డ షమీ ఆ టోర్నీ తర్వాత పూర్తిగా రెస్ట్ లో ఉన్నాడు. చీలమండ గాయం తగ్గకపోవడంతో షమీ ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించలేదని, అతను ఫిట్‌నెస్ టెస్ట్‌లో నెగ్గాల్సి ఉందని ఎన్‌సీఏ అధికారులు వెల్లడించారు.
షమీ లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అతడు లోటు దక్షిణాఫ్రికా సిరీస్ లో కొట్టచ్చినట్లు కనిపించింది. వన్డే ప్రపంచకప్ లో కూడా షమీ ప్రతిరోజూ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ సాయంతోనే మ్యాచ్ ఆడినట్లు కొన్ని నివేదికలు బహిర్గతం చేశాయి. అంటే నొప్పి భరిస్తూనే అద్భుత ప్రదర్శన చేశాడు షమీ. మరోవైపు బుమ్రా, సిరాజ్ మినహాయిస్తే భారత పేస్ దళం బలహీనంగా కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్ లాంటి బౌలర్లు అందుబాటులో లేకపోవడం కూడా టీమిండియాకు మైనస్ అనే చెప్పాలి. యువ బౌలర్లు అంచనాల తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. వారు ఒత్తిడిని తట్టుకోలేక చతికిల పడుతున్నారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జనవరి 25న హైదరాబాద్ వేదికగా మెుదలుకానుంది. రెండో టెస్టు ఫిబ్రవరి 02న వైజాగ్ లో జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి