Highest Man Of The Match Awards In IPL: ఐపీఎల్ అంటేనే దేశంలో ఒక పండగ వాతావరణం. కరోనా (Corona) కారణంగా ఐపీఎల్ 2021 (IPL 2021) సగంలోనే వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆగిపోయిన లీగ్ మళ్లీ నిన్నటి నుండి యూఏఈ (UAE)లో ప్రారంభమైంది. భారత్ లో మొదట 29 మ్యాచ్ లో జరిగాయి, కరోనా (Corona) అధికం అవటం మరియు ఆటగాళ్లు కరోనా భారిన పడటం కారణంగా ఐపీఎల్ (IPL) వాయిదా పడిన విషయం మన అందరికీ తెలిసిందే!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు నెలల విరామం తరువాత, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2021 సెప్టెంబర్ 19 న మొదలైంది. ఆగిపోయినప్పటి నుండి  బీసీసీఐ (BCCI) చేసిన ప్రయత్నాలు ఫలించి, యూఏఈలో (UAE) నిన్నటి నుంచి మరోసారి క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు రెడీ అయింది.


Also Read: KTR Vs Revanth: కేటీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌ ట్వీట్‌ వార్.. డ్రగ్స్‌ పరీక్షలపై విసిరిన వైట్‌ ఛాలెంజ్‌పై రచ్చరచ్చ


ఇక 14 ఏళ్ల చరిత్రలో ఐపీఎల్ రికార్డులను పరిశీలిస్తే... చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" (Man of the Match) గెలుచుకున్నారు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరచి, ప్రేక్షకులను ఉత్సాహ పరచటమే కాకుండా, వారి జట్టుకు ఎన్నో విజయాలను అందించారు. ఈ రికార్డును పరీశిలిస్తే... 


ఏబీ డివిలియర్స్
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ (RCB) తరపున ఆడుతున్న ఈ దిగ్గజ దక్షిణాఫ్రికా (South Africa) బ్యాట్స్‌మెన్ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. మిస్టర్ 360 అని పిలవబడే డివిలియర్స్ (AB Devilliers) ఐపీఎల్‌లో 176 మ్యాచ్‌లు ఆడగా, 5056 పరుగులు చేశాడు. రికార్డుల విషయానికి వస్తే...  25 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలిచి, అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 


Also Read: Dry Cough: పొడి దగ్గు తగ్గట్లేదా...! ఈ చిట్కాలు మీ కోసం...


క్రిస్ గేల్
విద్వంసకర బ్యాట్స్‌మెన్ గా పేరొందిన  క్రిస్ గేల్ (Chris Gayle) ఈ రికార్డ్ లిస్టు లో రెండో స్థానంలో నిలిచాడు. విండీస్ (West Indies) విద్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ 140 ఐపీఎల్ మ్యాచ్‌లలో 4950 పరుగులు సాధించి, 22 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలిచి, రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 6 సెంచరీలు కావటం క్రిస్ గేల్ బ్యాటింగ్ ఎంత విద్వంసకరంగా ఉంటుందో తెలుస్తుంది. 


రోహిత్ శర్మ
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సార్లు.. ముంబై ఇండియన్స్‌ను (MI) ఛాంపియన్‌గా నిలిపిన డాషింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ రికార్డు లిస్టు లో మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ  207 మ్యాచ్‌లు ఆడి ఐపీఎల్‌లో 5480 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ  18 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలిచి, మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ బ్యాట్ తోనే కాదండోయ్ బాల్ తో కూడా 15 వికెట్లు తీసాడు. అంతేకాదు ఇందులో హ్యాట్రిక్ కూడా ఉండటం మరో విశేషం. 


Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ నుంచి ఉమాదేవి ఔట్...ఎలిమినేషన్‌కు కారణాలివే..!


డేవిడ్ వార్నర్ & ఎంఎస్ ధోనీ
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు (SRH) చెందిన డేవిడ్ వార్నర్ (David Warner), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఇద్దరు నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇందులో ఆస్ట్రేలియన్ లెజెండ్ డేవిడ్ వార్నర్ 148 మ్యాచ్‌ల్లో 5447 పరుగులు చేసి 17 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలవగా, సూపర్ కింగ్స్ తల  ఎంఎస్ ధోనీ 212 మ్యాచ్‌ల్లో 4672 పరుగులు చేసి 17 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలిచి.. ఇద్దరు నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook