Tokyo Paralympics 2020: నేడు టోక్యోలో మరో విశ్వ క్రీడా సంబరం మెుదలుకాబోతోంది. 16వ పారాలింపిక్స్‌కు మంగళవారమే ప్రారంభంకానుంది. వైకల్యం శరీరానికే కాని.. తమ సంకల్పానికి కాదని చాటుతూ ప్రపంచం నలు మూలల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు తమ సత్తా చాటడానికి టోక్యోలో సిద్ధంగా ఉన్నారు. ఈ క్రీడల్లో భారత నుంచి 54 మంది పాల్గొంటున్నారు.  రెండంకెల సంఖ్యలో పతకాలే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకు పారాలింపిక్స్(Paralympics)లో భారత సాధించిన పతకాలు 12. అయితే టోక్యోలో మాత్రమే 15 పతకాలు సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సారి అత్యధికంగా 54 మంది పారా అథెట్లతో మనదేశం పతకాల వేటకు సిద్ధమైంది. గతంలో పారాలింపిక్స్(Paralympics)లో స్వర్ణాలు సాధించిన దేవేంద్ర జజారియా(Devendra Jazaria), మరియప్పన్ తంగవేలు(Mariyappan Tangavelu) సహా స్టార్ అథ్లెట్లు చాలా మందే బరిలోకి దిగుతున్నారు. 


Also Read: Tokyo Olympics: ఆ రాష్ట్రంలోని పాఠశాలలకు ఒలింపిక్స్ విజేతల పేర్లు..!


ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు 13 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. 22 క్రీడలకు సంబంధించి 540 ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తారు.  ఐదుగురు అథ్లెట్లు, ఆరు మంది అధికారులు మొత్తం 11 మందితో కూడిన భారత జట్టు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటుంది. పతాకధారి మరియప్పన్‌ తంగవేలు మన జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇరాన్‌ తర్వాత 17వ దేశంగా భారత్‌ స్టేడియంలోకి అడుగుపెట్టనుంది. ఈ సారి కొత్తగా బ్యాడ్మింటన్(Badminton), తైక్వాండో(Taekwondo)లో పోటీలు నిర్వహించనున్నారు.


గతంలో..
పారాలింపిక్స్‌(Paralympics)ను రెండోసారి నిర్వహించనున్న తొలి నగరం టోక్యో(Tokyo). 1964లోనూ అక్కడ ఈ క్రీడలు జరిగాయి. 1960లో రోమ్‌(Rome)లో తొలిసారి పారాలింపిక్స్‌ను నిర్వహించారు. అప్పుడు 23 దేశాల నుంచి 400  మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 1988 నుంచి ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ను ఒకే వేదికలో నిర్వహిస్తున్నారు. పారాలింపిక్స్‌లో చైనా(China) ఆధిపత్యమే కొనసాగుతోంది.


అఫ్ఘాన్లకు సంఘీభావంగా...
అఫ్గానిస్తాన్‌(Afghanistan‌)  తాలిబన్ల(Taliban) చెరలోకి వెళ్లిపోవటంతో...అక్కడ భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ అథ్లెట్లు ఎవరూ పారాలింపిక్స్‌లో పాల్గొనడం లేదు. అయితే అఫ్గాన్‌కు సంఘీభావం తెలుపుతూ..ఆ దేశ పతాకం ఆరంభోత్సవంలో ఎగరబోతోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రతినిధి అఫ్గాన్‌ పతాకాధారిగా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటారని అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ చీఫ్‌ పార్సన్స్‌ తెలిపారు.


Also Read: Afghanistan : మీ వెంట మేమున్నాం.. అఫ్గాన్‌ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook