IPl 2022 Mega Auction Players List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 విభిన్నంగా ఉండనుంది. రెండు కొత్త జట్ల రాకతో పాటు..ఆటగాళ్లు, కెప్టెన్లు మారనున్నారు. ఐపీఎల్  సీజన్ 15 కోసం బెంగళూరు వేదిక సిద్ధమౌతోంది. ఈసారి మెగా వేలానికి సిద్ధంగా ఉన్న టాప్ 5 ఆటగాళ్లు వీళ్లే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ (IPL 2022 Mega Auction) ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. దీనికోసం బీసీసీఐ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఐపీఎల్ జట్లన్నీ రిటైన్ ప్లేయర్స్ జాబితాలు సమర్పించడం, వేలానికి ఏయే ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారనేది తేటతెల్లమైంది. ఈసారి ఐపీఎల్‌లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు పాల్గొననున్నాయి. ఐపీఎల్ సీజన్ 15 కోసం వేలానికి సిద్ఘంగా ఉన్న టాప్ 5 క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.


ఆస్ట్రేలియన్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner). గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన లేకపోయినా..టీ20 ప్రపంచకప్‌లో మాత్రం విద్వంసం సృష్టించాడు. చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 38 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. కేవలం వార్నర్ కారణంగానే ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ప్రపంచకప్ సాధించింది. 35 ఏళ్ల వయస్సున్న వార్నర్‌కు ఈసారి వేలంలో కాసుల వర్షం కురవవచ్చు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు టైటిల్ అందించాడు. 


ఇక మరో క్రికెటర్ శిఖర్ ధావన్. ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals) జట్టు ఇతడిని రిలీజ్ చేయడం అందర్నీ ఆశ్చర్యపర్చినా..చాలా జట్లు శిఖర్ ధావన్ కోసం వేలం పాడే అవకాశాలున్నాయి. ఐపీఎల్ సీజన్‌లలో ఇతడికి మంచి రికార్డ్ ఉంది. 2019 ఐపీఎల్‌లో 521 పరుగులు, 2020లో 618, 2021లో 587 పరుగులు సాధించాడు. కొత్త ఫ్రాంచైజీలు శిఖర్ ధావన్‌పై కన్నేసినట్టు సమాచారం. ధావన్ పెద్ద సమస్య అతడి స్ట్రైక్‌రేట్. ఈ మధ్యన అది మెరుగుపడింది. కెప్టెన్‌గా సామర్ధ్యమున్న ఆటగాడు. 


ఇక దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్. కారణాలు తెలియదు కానీ చెన్నై సూపర్‌కింగ్స్ ఇతడిని రిటైన్ చేసుకోలేదు. ఐపీఎల్ సీజన్ 14లో అద్భుతంగా రాణించాడు. 16 మ్యాచ్‌లలో 633 పరుగుల సాధించాడు. 2020 సీజన్‌లో కూడా మంచి రికార్డ్ ఉంది. అయితే చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు తిరిగి ఇతడిని చేర్చుకోవాలని భావిస్తోంది. మరి వేలంలో ఏ మేరకు సాధించగలుగుతుందో తెలియదు. అద్భుతమైన స్ట్రైక్‌రేట్ ఉన్న డుప్లెసిస్ కోసం వివిధ జట్లు పోటీ పడగలవు. 


ఇక మరో ఆటగాడు సురేష్ రైనా. చెన్నై సూపర్‌కింగ్స్ రిటైన్ చేసుకోలేదు. ఐపీఎల్ 2021లో పెద్దగా రాణించకపోయినా..అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు. ఐపీఎల్‌లో సురేష్ రైనా రికార్డు అద్భుతమే. ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 5 వేల 528 పరుగులు సాధించాడు. ఈసారి ఐపీఎల్‌లో ఎంట్రీ ఇస్తున్న లక్నో, అహ్మదాబాద్ జట్లు సురేష్ రైనా కోసం పోటీ పడే అవకాశముంది. సురేష్ రైనా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలగడం అతని ప్లస్ పాయింట్. 


ఇక వెస్ట్‌ఇండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో. చెన్నై సూపర్ కింగ్స్‌కు (Chennai Superkings) చెందిన ఆటగాడు. వేలానికి సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో (IPL) ఇప్పటివరకూ అద్భుతమైన రికార్డు కలిగిన బ్రావో కోసం వివిధ ఫ్రాంచైజీలు పోడీ పడే అవకాశాలున్నాయి. బ్రావో టీ20 క్రికెట్‌లో (T20) 5 వందలకు పైగా వికెట్లు పడగొట్టాడు. అటు బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేయగలడు. 


Also read: Virat Kohli Test Records: ఏ భారత కెప్టెన్‌లకు అందనంత ఎత్తులో విరాట్ కోహ్లీ.. తిరుగులేని టెస్ట్ రికార్డులు ఇవే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook