Batter Forgets To Wear Pads During Village Cricket Match: క్రికెట్‌ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రసవత్తర మ్యాచులు జరగడంతో పాటుగా అపుడప్పుడు ఫన్నీ సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. క్యాచ్‌లు, రనౌట్‌లు, స్టంపింగ్‌ల సమయంలో సరదా ఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి ఆటగాళ్ల విచిత్ర ప్రవర్తనతో క్రికెట్‌ మైదానంలో ఫన్‌ క్రియేట్‌ అవుతుంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బ్యాటర్ క్రీజులోకి వచ్చేటప్పుడు ప్యాడ్లను కట్టుకోవడం మర్చిపోయాడు. ప్రత్యర్థి ప్లేయర్స్ చెప్పేవరకు అతడికి సోయే లేదు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే... ఇంగ్లండ్‌లో ప్రస్తుతం విలేజ్‌ క్రికెట్‌ మ్యాచులు జరుగుతున్నాయి. సౌత్‌హెండ్ సివిక్ క్రికెట్ క్లబ్‌ బ్యాటింగ్ చేస్తుండగా.. బౌలర్ మాట్ మోహన్ వేసిన ఐదవ ఓవర్ మూడో బంతికి బ్రాడ్ స్మిత్ అవుట్ అయ్యాడు. దాంతో మార్టిన్ హ్యూస్ క్రీజ్‌లోకి వచ్చేశాడు. హెల్మెట్ పెట్టుకొని బ్యాట్‌తో మైదానంలోకి దిగిన మార్టిన్.. ప్యాడ్లను కట్టుకోవడం మాత్రం మర్చిపోయాడు. వికెట్ల వద్దకు వెళ్లి గార్డ్‌ కూడా చెక్ చేసుకుని బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంపైర్‌ కూడా గమనించకపోవడం గమనార్హం. 



ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ప్యాడ్స్ కట్టుకోని విషయాన్ని గుర్తించి.. బ్రదర్ ప్యాడ్లు కట్టుకోవడం మర్చిపోయావ్ అని అన్నారు. దాంతో మార్టిన్ హ్యూస్ సారీ చెప్పి డగౌట్‌కు పరిగెత్తాడు. ఈ ఘటనతో నాన్ స్ట్రైకర్ సహా అంపైర్‌ కూడా నవ్వులు పూయించారు. ఇక ప్రత్యర్థి ప్లేయర్స్ అయితే తెగ నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఫన్నీగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోకి ఇప్పటివరకు 11 వేల లైక్స్ రాగ.. 1200 రీట్వీట్స్ వచ్చాయి. వీడియో చూసిన క్రికెట్ ఫాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. 


Also Read: టీమిండియా చార్టెడ్ ఫ్లైట్ కోసం రూ. 3.5 కోట్ల ఖర్చు.. బీసీసీఐపై పేలుతున్న సెటైర్లు!


Also Read: IND vs ZIM: రోహిత్‌ శర్మ ఔట్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook