Virat Kohli, Rahul Dravid, Siraj meets Ajaz Patel: అజాజ్ పటేల్.. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా vs న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌లో ఓ హాట్ టాపిక్ అయిన ప్లేయర్. ముంబైలో పుట్టిన ఈ అజాజ్ పటేల్ న్యూజిలాండ్ జట్టు తరపున టెస్ట్ సిరీస్‌లో పాల్గొని ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో శనివారం అజాజ్ పటేల్ తన పేరిట ఓ భారీ రికార్డును సృష్టించాడు. ఒకే ఇన్నింగ్సులో 10 వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా అజాజ్ పటేల్ చరిత్ర నెలకొల్పాడు. గతంలో ఆస్ట్రేలియా బౌలర్ అనిల్ కుంబ్లే, టీమిండియా మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లేల పేరిట ఈ రికార్డు ఉండగా.. తాజాగా ఆ జాబితాలో అజాజ్ పటేల్ (Ajaz Patel's 10 wickets video) పేరు కూడా వచ్చి చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతీయ మూలాలున్న అజాజ్ పటేల్ అరుదైన ఘనత సాధించిన నేపథ్యంలో అతడిని అభినందించేందుకు విరాట్ కోహ్లీ, మొహమ్మద్ సిరాజ్, టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్.. ముగ్గురు న్యూజిలాండ్ ఆటగాళ్లు కూర్చున్న చోటికి వెళ్లారు. అక్కడ అజాజ్ పటేల్‌కి (Ajaz Patel Viral video) షేక్ హ్యాండ్ ఇచ్చి అతడిని అభినందిస్తూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. 



Also read : Pushpa Making Video: నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్-పుష్ప యూనిట్‌కు అల్లు అర్జున్ అప్పీల్


విరాట్ కోహ్లీ, మొహమ్మద్ సిరాజ్, రాహుల్ ద్రావిడ్ న్యూజిలాండ్ ఆటగాళ్లు కూర్చునే చోటికి వెళ్లి అజాజ్ పటేల్‌ని అభినందించి రావడం అక్కడి కెమెరాల్లో రికార్డ్ అవడమే కాదు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral video) కూడా అయింది. క్రీడాకారుల క్రీడాస్పూర్తికి విరాట్ కోహ్లీ, మొహమ్మద్ సిరాజ్, రాహుల్ ద్రావిడ్ వైఖరి నిదర్శనంగా నిలిచింది. 


ఆట అంటే గెలుపు, ఓటములు మాత్రమే ముఖ్యం కాదు.. మనసారా ప్రతిభకు పట్టం కట్టడం కూడా ఓ గెలుపే అవుతుందంటూ విరాట్ కోహ్లీ, మొహమ్మద్ సిరాజ్, రాహుల్ ద్రావిడ్‌పై (Virat Kohli, Rahul Dravid, Mohammed Siraj congratulates Ajaz Patel) నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.


Also read : Aarya 2 trailer: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఆర్య 2 ట్రైలర్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook