Ravichandran Ashwin vs Eoin Morgan during KKR vs DC: ఐపిఎల్ 2021 దుబాయ్ షెడ్యూల్‌లో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ రవిచంద్రన్ అశ్విన్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టేన్ ఇయాన్ మోర్గాన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో టిమ్ సౌతి విసిరిన తొలి బంతిని రవి చంద్రన్ అశ్విన్ షాట్ కొట్టేందుకు యత్నించాడు. రవిచంద్రన్ కొట్టిన షాట్‌ని నితీష్ రాణా క్యాచ్ పట్టుకోవడంతో అశ్విన్ 9 పరుగులకే వెనుతిరగాల్సి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలోనే పెవిలియన్ బాటపట్టిన అశ్విన్‌కి టిమ్ సౌతి ఏదో గునగడం వినిపించింది. టిమ్ సౌతి నోరు పారేసుకోవడంతో అతడికి బుద్ది చెప్పి వెనుతిరిగి వెళ్లబోతున్న అశ్విన్‌కి ఈసారి ఇయాన్ మోర్గాన్ అడ్డుపడ్డాడు. దీంతో ఈసారి ఇంకొంచెం ఆగ్రహం చెందిన రవిచంద్రన్ అశ్విన్.. ఇయాన్ మోర్గాన్‌తో (Eoin Morgan) వాగ్వాదానికి దిగుతూ అతడివైపు వేగంగా అడుగులేయబోయాడు. రవిచంద్రన్ ఆగ్రహాన్ని పసిగట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ (Dinesh Karthik).. వెంటనే మధ్యలో కలగజేసుకుని అశ్విన్‌కి సర్దిచెబుతూ అతడిని వెనక్కి పంపించాడు. 



Also read : Kohli's Shirtless Photo: షర్ట్ లేకుండా టీమిండియా కెప్టెన్... వైరలైన విరాట్ కోహ్లీ ఫోటోస్


రవిచంద్రన్ అశ్విన్, టిమ్ సౌతి, ఇయాన్ మోర్గాన్ (Ravichandran Ashwin, Eoin Morgan) మధ్య జరిగిన వాగ్వాదం వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దినేష్ కార్తిక్ వెంటనే స్పందించడం, అతడు చెప్పడంతోనే రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) వెనక్కి తగ్గడంతో ఆ ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధం తప్పింది అని ఆ వీడియో చూసిన నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.



Also read : Inzamam Ul Haq: గుండెపోటుకు గురైన దిగ్గజ క్రికెటర్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌


కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR latest updates), ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో (KKR vs DC score live updates) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నైట్ రైడర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ని నిర్ధేశిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులకే పరిమితం చేసింది.


Moeen Ali: టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటగాడు..అసలు కారణం ఏంటంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook