IPL 2021, MI vs KKR: కేకేఆర్‌కు షాక్.. కెప్టెన్‌తో పాటు ఆటగాళ్లకు కూడా భారీ జరిమానా

IPL 2021: ముంబైపై విజయంతో ఉత్సాహంగా ఉన్న కేకేఆర్ కు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ మెయింటెన్ కారణంగా కెప్టెన్ మెర్గాన్ తో పాటు తుది జట్టులోని ఆటగాళ్లుకు సైతం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జరిమానా విధించింది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2021, 02:41 PM IST
  • కేకేఆర్‌కు భారీ షాక్
  • కెప్టెన్‌తో పాటు ఆటగాళ్లకు కూడా భారీ జరిమానా
  • స్లో ఓవర్ రేటే కారణం
IPL 2021, MI vs KKR: కేకేఆర్‌కు షాక్.. కెప్టెన్‌తో పాటు ఆటగాళ్లకు కూడా భారీ జరిమానా

Kolkata skipper Eoin Morgan, his playing XI fined for slow over-rate: ముంబైపై విజయం సాధించి మంచి ఊపు మీదున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders)జట్టుకు భారీ షాక్‌ తగిలింది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌తో పాటు తుదిజట్టులోని ఆటగాళ్లకు జరిమానా విధించారు. ఐపీఎల్‌-2021(IPL-2021) రెండో అంచెలో భాగంగా ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా సారథి మోర్గాన్‌కు రూ. 24 లక్షలు, ఆటగాళ్లకు కనీసం 6 లక్షల రూపాయలు లేదా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించారు. రెండోసారి ఈ తప్పిదం చేసినందుకుగానూ ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఈ మేరకు ఫైన్‌ వేసింది.

ఐపీఎల్‌ నియమావళి(IPL rules)ని అనుసరించి.. కనీస ఓవరు రేటు మెయింటెన్‌ చేయని కారణంగా.. రెండోసారి ఈ తప్పు పునరావృతం చేసినందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(Eoin Morgan)కు 24 లక్షల జరిమానా విధించాం. ఇక తుదిజట్టులో ఆడిన ప్లేయర్లకు ఒక్కొక్కరి ఫీజులో 25 శాతం కోత లేదంటే 6 లక్షల ఫైన్‌ వేశాం’’అని ఐపీఎల్‌ ప్రకటన విడుదల చేసింది. 

Also Read: IPL 2021: ముంబయిపై 7 వికెట్ల తేడాతో కోల్‌కతా గెలుపు

కాగా ఈ సీజన్‌ ఆరంభంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఏప్రిల్‌ 21న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో.. ఇదే తరహాలో స్లో ఓవర్‌ రేటు(Slow Over Rate) కారణంగా కేకేఆర్‌ కెప్టెన్‌ మోర్గాన్‌కు 12 లక్షల జరిమానా విధించారు. ఇక గురువారం అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఏడు వికెట్ల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ సందర్భంగా మోర్గాన్‌ మాట్లాడుతూ.. ముంబై వంటి మేటి జట్టుపై విజయం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నాడు. యువ ఆటగాళ్లు మెరుగ్గా రాణించారని వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠిపై ప్రశంసలు కురిపించాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News