Happy Retirement: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చుట్టూ తిరుగుతోంది సోషల్ మీడియా. కంగారూల గడ్డపై ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఈ ఇద్దరి వైఫల్యమే ఇందుకు కారణం. వరుసగా నాలుగు టెస్టుల్లోనూ విఫలం కావడంతో ఇక క్రికెట్ నుంచి వైదొలగమని సూచిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏమైందో తెలియదు గానీ టీమ్ ఇండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఘోరమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ ఇద్దరూ విఫలం కావడంతో టాప్ ఆర్డర్ కుప్పకూలుతోంది. టీమ్ ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఈ ఇద్దరి బ్యాట్ నుంచి పరుగులు రాలడం లేదు. మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 3 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అటు విరాట్ కోహ్లి సైతం తొలి ఇన్నింగ్స్‌లో‌ 36 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేశాడు. ఈ సిరీస్ మొత్తంలో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. 3 మ్యాచ్‌లు 5 ఇన్నింగ్స్‌లలో కేవంల 31 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ 4 మ్యాచ్‌లు 7 ఇన్నింగ్స్‌లు ఆడి 167 పరుగులు చేశాడు. 


దాంతో రోహిత్, విరాట్‌ పై అభిమానులు మండిపడుతున్నారు. ఆడింది చాలు..ఇక ఆగిపోండంటూ సూచనలిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నడూ లేనంతగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరికి నెటిజన్లే స్వయంగా రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా ఇద్దరి రిటైర్మెంట్‌కు శుభాకాంక్షలు అంటూ వ్యంగ్యాస్థ్రాలు సంధిస్తున్నారు. ఇద్దరి ఫోటోల్ని షేర్ చేస్తూ చేస్తున్న HappyRetirement హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. మీ టెస్ట్ కెరీర్ ముగిసింది, ఇక ఆడే చాన్స్ లేదంటున్నారు. రోహిత్ శర్మ పుస్తకం చదువుతున్నట్టుగా ఓ ఫోటో క్రియేట్ చేసి హ్యాపీ రిటైర్మెంట్ రోహిత్ సాబ్, ఇప్పుడు రోజంతా ఇదే పుస్తకం చదువుతూ ఉండండి అంటూ కామెంట్ చేస్తున్నారు. 


మొత్తానికి ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఇద్దరికీ ముందే రిటైర్మెంట్ ఇచ్చి గ్రీటింగ్స్ తెలుపుతున్నారు. 


Also read: Ind vs Aus Test: నాలుగో టెస్ట్‌లో టీమ్ ఇండియా ఓటమి, సిరీస్ 2-1 ఆసీస్ వశం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.