Virat Kohli, Anushka Sharma: పాకిస్థాన్‌పై టీమిండియాను గెలిపించిన ఆనందంలో ఉన్న విరాట్ కోహ్లీ.. ఇంకా టీ20 వరల్డ్ కప్ గెలవకుండానే గెలిచినంత ఆనందాన్ని అందరికీ పంచిపెట్టాడు. పాకిస్థాన్‌పై 53 బంతుల్లో 82 పరుగులు సాధించి బ్రిలియంట్ ఫామ్‌లో ఉన్నాడనిపించుకున్నాడు. నాలుగు సిక్సులు, ఆరు ఫోర్లు బాది పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఈ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌కి వేదికైంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అవుతున్న క్రికెట్ ప్రియులు.. కోహ్లీని మరోసారి హీరోలా ట్రీట్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్ కోహ్లీ ఆట చూసి, అతడి పోరాటపటిమ చూసి సీనియర్ క్రికెటర్స్, క్రికెట్ లెజెండ్స్ సైతం అతడిని అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో ఉగ్రరూపం చూపించాడు అంటూ కితాబిస్తున్నారు.



 


మ్యాచ్ గెలిచిన అనంతరం మీడియా పార్ట్‌నర్స్‌తో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. మ్యాచ్ పూర్తయిన అనంతరం తన భార్య అనుష్కా శర్మకు కాల్ చేశానని.. ఆమె ఆనందంతో ఉబ్బి తబ్బిబవుతోందని అన్నాడు. టీమిండియాను గెలిపించడం పట్ల అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని.. వాళ్లంతా తనకు ఫోన్ చేసి కంగ్రాచ్యులేట్ చేస్తూ వారి సంతోషాన్ని తనతో పంచుకున్నారని అనుష్క చెప్పిందన్నాడు. 


అందరూ ఫోన్ చేసి కంగ్రాచ్యులేట్ చేస్తోంటే.. ఆ ఆనందంలో ఏం చేయాలో కూడా తనకు అర్థం కావడం లేదని అనుష్క శర్మ చెప్పిన విషయాన్ని, ఆమెతో జరిగిన సంభాషణను విరాట్ కోహ్లీ ( Virat Kohli ) బ్రాడ్‌కాస్టర్స్‌తో పంచుకున్నాడు. అందుకే బయట ఏం జరుగుతుందో తనకేమీ తెలియదు కానీ.. తనకు తెలిసిందల్లా మైదానంలో తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వర్తించడమే అని వివరించాడు.


Also Read : Virat Kohli in T20Is: టీ20ల్లో దుమ్మురేపిన విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మను దాటేసి మరో రికార్డు


Also Read : Virat Kohli-Rohit Sharma: నువ్వే 'కింగ్'వు.. విరాట్ కోహ్లీని ఎత్తుకుని గిరగిరా తిప్పేసిన రోహిత్‌ శర్మ! వైరల్ అవుతున్న వీడియో


Also Read : Ind vs Pak: నరాలు తెగే ఉత్కంఠ, చివరి ఓవర్‌లో అసలు ఏం జరిగింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి