Virat Kohli: నా కెరీర్‌లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్.. ఎమోషనల్ అయిన విరాట్ కోహ్లీ!

IND vs PAK T20 World Cup 2022, King Kohli Gets Emotional after India beat Pakistan. నా కెరీర్‌లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో భారత్ అద్భుత విజయం సాధించింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Oct 23, 2022, 06:29 PM IST
  • నా కెరీర్‌లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్
  • ఎమోషనల్ అయిన విరాట్ కోహ్లీ
  • ఉత్కంఠ పోరులో పాకిస్తాన్‌పై భారత్ విజయం
Virat Kohli: నా కెరీర్‌లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్.. ఎమోషనల్ అయిన విరాట్ కోహ్లీ!

IND vs PAK T20 World Cup 2022: Virat Kohli says This is My Best Innings in my cricket career: టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్ 12లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో భారత్ అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. పాక్ సిన్నర్ మహ్మద్ నవాజ్ 'నో బాల్' వేయడం కలిసొచ్చింది. కింగ్ 'విరాట్' కోహ్లీ (82 నాటౌట్; 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) ఒంటి చేత్తో టీమిండియాను గెలిపించాడు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్, మహ్మద్ నవాజ్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత్ బోణీ కొట్టింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 రన్స్ చేసింది. షాన్ మసూద్ (52 నాటౌట్; 42 బంతుల్లో 5 ఫోర్లు), ఇఫ్తికర్ అహ్మద్ (51; 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడేసి వికెట్లు తీసారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి విజయం సాధించింది. విరాట్ కోహ్లీకి అండగా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు) భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

భారత్ మ్యాచ్ గెలవగానే విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. గెలిచిన ఆనందంలో కింగ్ కళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. ఇక మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఓ యుద్ధ వాతావరణంలా అనిపించింది. మాట్లాడడానికి నాకు మాటలు రావడం లేదు. చివరి ఓవర్లో ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు. ఏదేమైనా విజయం సాధించడం సంతోషంగా ఉంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై మొహాలీలో ఆడిన ఆట నా అత్యుత్తమ ఇన్నింగ్స్. ఇప్పుడు చెపుతున్నా.. నా కెరీర్‌లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్. అభిమానులు నాకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. మీ మద్దతుకు నేను కృతజ్ఞుడను' అని అన్నాడు. 

'చివరి ఓవర్ వరకు ఆడితే గెలుస్తామని హార్దిక్ పాండ్యా నమ్మాడు. షాహీన్‌ ఆఫ్రిది బౌలింగ్‌లో పరుగులు చేయాలని నిర్ణయించుకున్నాం. హరీస్ రవూఫ్ వారి ప్రధాన బౌలర్. నేను రెండు సిక్సర్లు కొట్టాను. కాలుకులేషన్ చాలా సింపుల్.. మొహ్మద్ నవాజ్ బౌలింగ్ చేయడానికి ఒక ఓవర్ ఉంది. కాబట్టి 19వ ఓవర్లో హరీస్‌ను చితకొడితే.. పాక్ బయపడుతుంది. 8 బంతుల్లో 28 రన్స్ చేయాలి. రెండు సిక్సుల అనంతరం 6 బంతుల్లో 16 రన్స్ అవసరం అయ్యాయి. నేను నా ఆట ఆడాను. క్రీజులో ఉండాలనుకునాన్నను' అని కోహ్లీ చెప్పాడు. 

Also Read: అల్లు అరవింద్ మాస్టర్ స్కెచ్.. మెగా హీరోతో రిషబ్ పాన్ ఇండియా మూవీ?

Also Read: నాటు నాటు సాంగ్ కు కాలు కదిపిన జపనీస్ యూట్యూబర్..ఏమి గ్రేస్ అయ్యా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News