Virat Kohli-Rohit Sharma: నువ్వే 'కింగ్'వు.. విరాట్ కోహ్లీని ఎత్తుకుని గిరగిరా తిప్పేసిన రోహిత్‌ శర్మ! వైరల్ అవుతున్న వీడియో

IND vs PAK T20 World Cup 2022, Rohit Sharma lifts Virat Kohli in MCG Ground after India beat Pakistan. భారత్ విజయం సాదించగానే రోహిత్ శర్మ పరుగెత్తుకొంటూ వచ్చి.. విరాట్ కోహ్లీని ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Oct 23, 2022, 07:12 PM IST
  • ఉత్కంఠ పోరులో పాకిస్తాన్‌పై భారత్ విజయం
  • కోహ్లీని ఎత్తుకుని గిరగిరా తిప్పేసిన రోహిత్‌
  • నువ్వే 'కింగ్'వు
Virat Kohli-Rohit Sharma: నువ్వే 'కింగ్'వు.. విరాట్ కోహ్లీని ఎత్తుకుని గిరగిరా తిప్పేసిన రోహిత్‌ శర్మ! వైరల్ అవుతున్న వీడియో

IND vs PAK T20 World Cup 2022, Team India Captain Rohit Sharma lifts Virat Kohli in MCG Ground: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ శుభారంభం చేసింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్‌ 'సూపర్‌' విజయం సాధించింది. చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటమి ఖాయం అనుకున్న దశలో 'కింగ్' విరాట్ కోహ్లీ (82 నాటౌట్; 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) ఎలాంటి తడబాటు లేకుండా మ్యాచును భారత్ వైపు తిప్పాడు. అంతేకాదు కడవరకు క్రీజులో ఉండి.. ఏ క్రికెట్ అభిమాని ఊహించని విధంగా టీమిండియాకు అద్భుత విజయం అందించాడు. 

చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరం అయ్యాయి. పాక్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ వేసిన తొలి బంతికి ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు) ఔటయ్యాడు. రెండో బంతికి ఫినిషర్ దినేశ్ కార్తీక్ సింగిల్ తీయగా.. మూడో బంతికి కోహ్లీ రెండు రన్స్ తీసాడు. నవాజ్ నాలుగో బంతిని నోబాల్‌గా వేయగా.. విరాట్ దాన్ని సిక్స్‌గా మలిచాడు. దాంతో భారత్ విజయానికి చివరి మూడు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఫ్రీ హిట్ బాల్‌ను వైడ్‌గా వేయడంతో.. సమీకరణం 3 బంతుల్లో 5 పరుగులుగా మారింది. 

నాలుగో బంతికి విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అవ్వగా.. అది ఫ్రీ హిట్ కావడంతో కింగ్ కోహ్లీ, దినేష్ కార్తీక్ 3 పరుగులు తీసారు. దాంతో సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఐదో బంతికి డీకే స్టంపౌటవ్వడంతో మ్యాచ్ మళ్లీ ఉత్కంఠకు దారితీసింది. చివరి బంతిని మహ్మద్ నవాజ్ వైడ్‌గా వేయడంతో.. మ్యాచ్ టై అయ్యింది. చివరి బంతికి ఆర్ అశ్విన్ సింగిల్ తీసి.. టీమిండియాకు విజయాన్ని అందించాడు. 

భారత్ విజయం సాదించగానే.. విరాట్ కోహ్లీ ఆనందంతో మైదానంలో పరుగెత్తాడు. ఆపై భావోద్వేగానికి గురయ్యాడు. మైదానంలో కన్నీటిని ఆఫుకోలేకపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్నడూ లేనివిధంగా మైదనాంలోకి పరుగెత్తుకొంటూ వచ్చి.. కోహ్లీని ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు. మ్యాచ్ గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పాడు. కోహ్లీ సైతం తన సారథిని హత్తుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసి ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Virat Kohli: నా కెరీర్‌లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్.. ఎమోషనల్ అయిన విరాట్ కోహ్లీ!

Also Read: అల్లు అరవింద్ మాస్టర్ స్కెచ్.. మెగా హీరోతో రిషబ్ పాన్ ఇండియా మూవీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News