భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli birthday) నేడు 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ దుబాయ్‌లో తన పుట్టినరోజు వేడుకలు (Virat Kohli birthday Celebration) జరుపుకున్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టు కెప్టెన్‌గా కోహ్లీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నేడు విరాట్ కోహ్లీ 32వ పుట్టినరోజు. ఆర్సీబీ ఆటగాళ్లు, భార్య అనుష్క శర్మ విరాట్ కోహ్లీతో బర్త్‌డే కేక్ కట్ చేయించారు. ప్రస్తుతం కరోనా టైమ్ కావడంతో యూఏఈ వేదికగా ఐపీఎల్ జరుగుతోంది. కోహ్లీ కెప్టెన్సీలోని ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడుకల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుష్క సైతం ప్రస్తుతం యూఏఈలో తన భర్త ఆడే మ్యాచ్‌లను వీక్షిస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 5న విరాట్ కోహ్లీ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు. కేక్ కట్ చేసిన కోహ్లీ తన భార్య అనుష్క శర్మకు ప్రేమగా కేక్ తినిపించారు. అనుష్క కూడా కోహ్లీకి కేక్ తినిపించి వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కోహ్లీ ఫ్యాన్ క్లబ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. 



 



 


కాగా, ప్లేఆఫ్స్ మ్యాచ్ కోసం కోహ్లీ, అతడి సారథ్యంలోని ఆర్సీబీ జట్టు కసరత్తులు చేస్తోంది. నేడు క్వాలిఫయర్ 1 మ్యాచ్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుండగా.. రేపు (నవంబర్ 6న) ఆర్సీబీ, సన్‌రైజర్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe