Die Hard Fan touches Virat Kohli Feet in IND vs SL 3rd ODI: తిరువనంతపురం వేదికగా ఆదివారం (జనవరి 16) శ్రీలంక, భారత్‌ మధ్య మూడో వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో భారత్ ఏకంగా 317 పరుగుల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ని 3-0 తేడాతో గెలిచింది. మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీర విహారం చేశారు. ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తిస్తూ.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు. కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 పరుగుల చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో కోహ్లీకి ఇది 74వ సెంచరీ కాగా.. వన్డేల్లో 46వది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌ జరుగుతుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అభిమాని అయిన ఓ యువకుడు మైదానంలోకి దూసుకొచ్చాడు. నేరుగా కోహ్లీ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి కాళ్లకు దండం పెట్టాడు. విరాట్ కాళ్లు మొక్కుతూ ఆ అభిమాని పెద్దగా కేకలు వేశాడు. కోహ్లీ అతడిని ఏమీ అనకుండా.. తన చేతులతో పైకి లేపి హత్తుకున్నాడు. దాంతో ఆ అభిమాని సంతోషం వ్యక్తం చేశాడు. సెక్యూరిటీ వచ్చి అతడిని బయటికి లాక్కెళుతుండగా ఏమనొద్దని కోహ్లీ వారితో చెప్పాడు. 



ఈ మ్యాచులో 'మిస్టర్ 360' సూర్యకుమార్ యాదవ్ అందరి మనసులు గెల్చుకున్నాడు. సూర్య స్మార్ట్ ఫోన్ తీసుకుని స్వయంగా విరాట్ కోహ్లీ, అతడి అభిమానిని ఫొటోలు తీశాడు. దీంతో మైదానంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫాన్స్ కూడా పలుమార్లు మైదానంలోకి దూసుకోచ్చారు. 



Also Read: IND vs SL: మూడో వన్డేలో భారత్‌ విజయం.. 9 రికార్డ్స్ బ్రేక్ చేసిన కోహ్లీ! నమోదయిన రికార్డులు ఇవే 


Also Read: Best Electric Scooters: ఓలాకు పోటీగా ఆంపియర్.. 85 వేల కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.