IND vs SL: మూడో వన్డేలో భారత్‌ రికార్డు విజయం.. నమోదయిన రికార్డులు ఇవే! 9 రికార్డ్స్ బ్రేక్ చేసిన కోహ్లీ

Virat Kohli breaks 9 records in IND vs SL 3rd ODI. భారత్‌ vs శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏకంగా 9 రికార్డ్స్ బ్రేక్ చేశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 16, 2023, 10:43 AM IST
  • మూడో వన్డేలో భారత్‌ రికార్డు విజయం
  • నమోదయిన రికార్డులు ఇవే
  • 9 రికార్డ్స్ బ్రేక్ చేసిన కోహ్లీ
IND vs SL: మూడో వన్డేలో భారత్‌ రికార్డు విజయం.. నమోదయిన రికార్డులు ఇవే! 9 రికార్డ్స్ బ్రేక్ చేసిన కోహ్లీ

Virat Kohli breaks 9 records in India vs Sri Lanka 3rd ODI: శ్రీలంకతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 317 పరుగుల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ని  3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (166), శుభ్‌మాన్‌ గిల్‌ (116) సెంచరీలతో చెలరేగారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక.. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ దెబ్బకు (6 వికెట్స్) 73 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం. 

రికార్డులు ఇవే:
# వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా (317) భారత్ భారీ విజయం అందుకుంది. న్యూజిలాండ్‌ (ఐర్లాండ్‌పై 290) పేరిట ఉన్న రికార్డును భారత్‌ అధిగమించింది. 

# విరాట్ కోహ్లీ సెంచరీ బాదడంతో స్వదేశంలో అత్యధిక శతకాలు (21) బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇదివరకు ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ (20) పేరిట ఉంది. 

# వన్డేల్లో శ్రీలంకపై విరాట్ కోహ్లీ 10వ సెంచరీ బాదాడు. వన్డేల్లో ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సచిన్‌ టెండూల్కర్ (వెస్టిండీస్‌పై 9) రెండో స్థానంలో ఉన్నాడు. 

# వన్డేల్లో విరాట్ కోహ్లీకిది రెండో అత్యధిక స్కోరు. 2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై 183 పరుగులు చేశాడు.   

# వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (12,574) ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌ శతకం చేయడం ద్వారా లంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే (12650)ను అధిగమించాడు. 

# వన్డే ఫార్మాట్‌లో వేగంగా (106 బంతుల్లో) 150 రన్స్ చేసిన రెండో భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇషాన్‌ కిషన్‌ (103 బంతుల్లో బంగ్లాదేశ్‌పై) తొలి స్థానంలో ఉన్నాడు. 

# మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 8 సిక్స్‌లు బాదాడు. వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో కోహ్లీ అత్యధిక సిక్స్‌లు ఇవే. 

# వన్డేల్లో శ్రీలంకకు ఇది (73) నాలుగో అత్యల్ప స్కోరు. 

# వన్డే ఫార్మాట్‌లో శ్రీలంకపై భారత్‌కు నాలుగో (390/5) అత్యధిక స్కోరు ఇది.

# వన్డే ఫార్మాట్లో శ్రీలంకపై అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన జాబితాలో ఎంఎస్ ధోనీతో కలిసి విరాట్ కోహ్లీ (21) రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సచిన్‌ టెండూల్కర్ (25) ఉన్నాడు. 

# అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌లు అందుకున్న మూడో ఆటగాడిగా విరాట్ కోహ్లీ(10) నిలిచాడు. మొదటి స్థానంలో సచిన్‌ టెండూల్కర్ (15) ఉండగా.. రెండో స్థానంలో సనత్‌ జయసూర్య (11) ఉన్నాడు. 

# వన్డేల్లో 150కి పైగా స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్లలో సచిన్‌ టెండ్యూలర్, క్రిస్ గేల్‌తో కలిసి విరాట్ కోహ్లీ(5) మూడో స్థానంలో నిలిచాడు. రోహిత్‌ శర్మ (8), డేవిడ్‌ వార్నర్‌ (6) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

# మొహ్మద్ సిరాజ్‌ (4/32) వన్డేల్లో తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. 

Also Read: Best Electric Scooters: ఓలాకు పోటీగా ఆంపియర్.. 85 వేల కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు!  

Also Read: Delhi Cold Weather: పడిపోతున్న ఢిల్లీ ఉష్ణోగ్రతలు.. నేటి నుంచి మరో 'కోల్డ్‌ స్పెల్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x